Telangana Formation Day : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలకు మాత్రమే పరిమితమైన సంగతి మన అందరికీ తెలిసిందే. ఆ పార్టీ స్థాపించిన రోజు నుండి నేటి వరకు ఆయన ఆంధ్ర ప్రదేశ్ లోని సమస్యల మీదనే ఎక్కువగా పోరాటం చేస్తూ వచ్చాడు. రాష్ట్ర ప్రజలు కూడా ఆయన్ని గుర్తించి ఉప ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టారు. అయితే పవన్ కళ్యాణ్ కి ఆంధ్ర ప్రదేశ్ లో ఏ స్థాయి అభిమానులు ఉన్నారో, తెలంగాణ లో కూడా అదే స్థాయి అభిమానులు ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ లో పవన్ కళ్యాణ్ ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ మరో హీరోకి లేదని విశ్లేషకులు అంటూ ఉంటారు. ఆ సినిమాలు ఆ ప్రాంతంలో రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతూ ఉండేవి. అయితే తెలంగాణ పవన్ కళ్యాణ్ అభిమానులు తమ ప్రాంతం లో కూడా జనసేన పార్టీ ని విస్తరింపజేయాలని, కనీసం మా ప్రాంతం గురించి గొప్పగా అయినా మాట్లాడాలని కోరుకుంటూ ఉంటారు.
ఈమధ్య కాలం లో ఆయన తెలంగాణ ప్రస్తావన తీసుకొచ్చిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. కానీ నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో వేసిన ఒక ట్వీట్ బాగా వైరల్ అయ్యింది. ఆయన మాట్లాడుతూ ‘జనసేన పార్టీ పుట్టింది తెలంగాణ నేల మీదనే. నాలో ఉద్యమ స్ఫూర్తిని నింపి బలహీనులకు అండగా నిలబడడం నేర్పింది తెలంగాణ నేలనే. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ దాశరధి కృష్ణమాచార్య కీర్తించింది ఈ నేల మీదనే. మూడున్నర కోట్ల ప్రజల ఆశలు, ఆకాంక్షలకు, దశాబ్దాల పోరాటాలకు ప్రతిరూపంగా, విద్యార్ధులు, యువత బలిదానాలతో ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని 12 వ ఏటలోకి అడుగుపెడుతున్న సందర్భంగా అన్ని రంగాలలో సంక్షేమాభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని, ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ, ప్రజలందరికీ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’ అంటూ ఆయన వేసిన ట్వీట్ బాగా వైరల్ అయ్యింది.
Also Read : తెలంగాణ ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు
ఇదంతా పక్కన పెడితే చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ నుండి ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఉప ముఖ్యమంత్రి అయ్యాక పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న చిత్రం కావడంతో అభిమానులు ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆ అంచనాలకు తగ్గట్టుగా మూవీ టీం ప్రొమోషన్స్ చేయకపోవడం పై అభిమానులు ఫైర్ మీద ఉన్నారు. ముఖ్యంగా పది రోజుల్లో సినిమా పెట్టుకొని ఇప్పటి వరకు థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయకపోవడం నిర్మాతల నిర్లక్ష్యానికి పరాకాష్ట లాంటిది అంటూ సోషల్ మీడియా లో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం ట్రైలర్ ఈ నెల 5 న విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
జనసేన పార్టీకి జన్మనిచ్చిన నేల, నాకు పునర్జన్మను ఇచ్చిన నేల, నాలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన నేల, నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ దాశరథి కృష్ణమాచార్య కీర్తించిన నేల నా తెలంగాణ. మూడున్నర కోట్ల ప్రజల ఆశలు, ఆకాంక్షలకు, దశాబ్దాల పోరాటాలకు ప్రతిరూపంగా, విద్యార్ధులు, యువత బలిదానాలతో…
— Pawan Kalyan (@PawanKalyan) June 2, 2025