ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ లలో ఒకటైన కెనరా బ్యాంక్ లోన్ తీసుకోవాలని భావించే వాళ్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. కస్టమర్లకు ప్రయోజనం చేకూరేలా కొత్త లోన్ స్కీమ్స్ ను అమలులోకి తెచ్చింది. కెనరా బ్యాంక్ హెల్త్ కేర్ క్రెడిట్, బిజినెస్ లోన్, పర్సనల్ లోన్ కస్టమర్ల కోసం ఆఫర్ చేస్తుండగా రుణాలు తీసుకోవాలని భావించే వాళ్లకు ఈ ఆఫర్ల వల్ల ప్రయోజనం చేకూరుతుంది. కరోనా సమయంలో చాలామందికి ఈ లోన్ వల్ల మేలు జరగనుంది.
రిజిస్టర్డ్ హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్, డయాగ్నస్టిక్ సెంటర్లు, పాథాలజీ ల్యాబ్స్, ఇతరులు కెనరా చికిత్స హెల్త్‌కేర్ క్రెడిట్ ఫెసిలిటీ కింద 10 లక్షల రూపాయల నుంచి 50 కోట్ల రూపాయల వరకు సులభంగా రుణం పొందే అవకాశం ఉంటుంది. కెనరా బ్యాంక్ తక్కువ వడ్డీరేట్లకే ఈ లోన్లను అందిస్తుండటం గమనార్హం. ఎవరైతే రుణం తీసుకుంటారో వాళ్లు 10 ఏళ్లలో రుణాన్ని తిరిగి కట్టాల్సి ఉంటుంది. ఈ లోన్ ను తీసుకున్న వాళ్లు ఏకంగా 18 నెలల వరకు మారటోరియం ను పొందవచ్చు.
మెడికల్ ఆక్సిజన్, ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు తయారు చేసే సంస్థలకు కెనరా బ్యాంక్ ఏకంగా 2 కోట్ల రూపాయల వరకు రుణాలను అందిస్తుండటం గమనార్హం. కెనరా జీవన రేఖ హెల్త్ కేర్ బిజినెస్ లోన్ కింద ఈ రుణాలను పొందే అవకాశం ఉంటుంది. ఈ రుణాలు పొందిన వాళ్లు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదు. కెనరా బ్యాంక్ 5 లక్షల రూపాయల వరకు పర్సనల్ లోన్స్ ను కూడా అందిస్తోంది.
కెనరా సురక్ష పర్సనల్ లోన్ స్కీమ్ కింద ఈ రుణాలను పొందే అవకాశం ఉంటుంది. 6 నెలలు ఈఎంఐ కట్టకుండా రూ.25 వేల నుంచి రూ.5 లక్షల వరకు లోన్ పొందే అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ 30 వరకు ఈ స్కీమ్ అందుబాటులో ఉండగా ఈ స్కీమ్ లో చేరిన వాళ్లు ప్రాసెసింగ్ ఫీజు మాఫీ బెనిఫిట్ ను పొందే అవకాశం ఉంటుంది.