Business Idea: కానీ వ్యాపారం చేయడానికి అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలి అని అనుకుంటారు. కానీ చిన్న పెట్టుబడి తో అధిక లాభాలను ఇచ్చే వ్యాపారాలు కూడా చాలా ఉన్నాయి. ఇంట్లో నుంచే చిన్న వ్యాపారం చేస్తూ లక్షల్లో ఆదాయం పొందొచ్చు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే అగర్బత్తి తయారీ వ్యాపారం కూడా బాగా డిమాండ్ ఉన్న వ్యాపారం. పెళ్లిళ్లు, మతపరమైన వేడుకలు మరియు మతపరమైన కార్యక్రమాలలో అగర్బత్తికి ఉన్న డిమాండ్ గురించి అందరికీ తెలిసిందే. తాజాగా మీడియా నివేదికల ప్రకారం ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ అగర్బత్తి కరాల తయారీ వ్యాపారంపై ఒక ప్రాజెక్టు నివేదికను కూడా రెడీ చేసింది. ఈ వ్యాపారానికి పెద్దగా సాంకేతిక మరియు ప్రత్యేక రకమైన పరికరాలు కూడా అవసరం ఉండదు. చాలా తక్కువ డబ్బుతో ఈ వ్యాపారాన్ని ఇంటి దగ్గరే ప్రారంభించవచ్చు. వీటిని తయారు చేయడానికి విద్యుత్ అవసరం కూడా ఉండదు. మన దేశాన్ని అగర్బత్తుల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఖాది మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ ద్వారా ఉపాధి కల్పన కార్యక్రమానికి కూడా అనుమతి ఇచ్చింది. దేశంలో ఉన్న అన్ని ప్రాంతాలలోనే నిరుద్యోగులకు మరియు వలస కార్మికులకు ఉపాధి కల్పించడం కోసం ఆది అగర్బత్తి ఆత్మనిర్భర్ మిషన్ అని పిలిచే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం దేశీయ అగర్బత్తి ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది.
Also Read: కేంద్రం సరికొత్త నిర్ణయం.. ఇకపై ఈ కార్డులన్ని ఒకే పోర్టల్ లో అప్డేట్ చేయబడతాయి…
ముఖ్యంగా దీపావళి, చాట్ చాట్ వంటి పలు సందర్భాలలో కూడా పూజా సామాగ్రికి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి పండుగలు సీజన్లో అగర్బత్తుల తయారీ వ్యాపారాన్ని ఇంట్లోనే సులభంగా మొదలు పెట్టవచ్చు. మార్కెట్లో అగర్బత్తులకు చాలా డిమాండ్ ఉంటుంది. వీటిని తయారు చేయడానికి గం పౌడర్, వెదురు, బొగ్గు పొడి, నార్సీ సన్ పౌడర్, నీరు, సువాసన, సుగంధ నూనె, పూలరేకులు, గంధపుచెక్క, రంపపు దుమ్ము, జెలీటిన్ కాగితం, ప్యాకింగ్ పదార్థం వంటివి అవసరమవుతాయి. మీరు మార్కెట్లో వీటికోసం మంచి సరఫరాదారులను సంప్రదించవచ్చు.
వీటిని తయారు చేయడానికి పలు రకాల యంత్రాలను ఉపయోగిస్తారు. మిక్సర్ యంత్రాలు, ప్రధాన ఉత్పత్తి యంత్రాలు, డ్రాయర్ యంత్రాలు వంటివి అగర్బత్తుల తయారీలో ఉపయోగపడతాయి. అయితే మన దేశంలో వీటి తయారీ యంత్రం ధర ప్రస్తుతం రూ.35,000 నుంచి రూ.1,75,000 వరకు ఉన్నట్లు సమాచారం. ఒక నిమిషంలో ఈ యంత్రం ద్వారా 150 నుంచి 200 అగర్బత్తులను తయారు చేయవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో ఆటోమేటిక్ అగర్బత్తుల తయారీ మిషన్ ధర రూ.90,000 నుంచి రూ.1,75,000 వరకు ఉన్నట్లు సమాచారం. ఒక్క రోజులో 100 కిలోల అగర్బత్తులను ఈ ఆటోమేటిక్ మిషన్ ద్వారా తయారు చేయవచ్చు. ఒకవేళ మీరు చేతితో తయారు చేయాలి అనుకుంటే కేవలం రూ.15,000 కంటే తక్కువ ఖర్చు అవుతుంది.