Junior NTR and Prashanth Neel : ఎన్టీఆర్(Junior NTR), ప్రశాంత్ నీల్(Prashanth Neel) మూవీకి సంబంధించిన షూటింగ్ ఇటీవలే గ్రాండ్ గా మొదలైన సంగతి తెలిసిందే. గత ఏడాది పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ చిత్రం, ఈ ఏడాది కొద్దినెలల క్రితమే రెగ్యులర్ షూటింగ్ ని మొదలు పెట్టుకుంది. ముందు ఎన్టీఆర్ లేని సన్నివేశాలను కొన్ని చిత్రీకరించారు. ఏప్రిల్ 22 నుండి ఎన్టీఆర్ రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కర్ణాటక ప్రాంతంలో జరుగుతుంది. అక్కడ వేసిన భారీ సెట్స్ లో ఎన్టీఆర్ పై కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రకటించిన కొత్తల్లోనే 2026 , సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నామని మేకర్స్ అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఆ తేదీన విడుదల అవుతుందని బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయారు. కానీ కాసేపటి క్రితమే మూవీ టీం అధికారికంగా విడుదల తేదీని ప్రకటించింది.
Also Raed : ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ గ్లింప్స్ వచ్చేది అప్పుడేనా..?
ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. జూన్ 25 అంటే గురువారం రోజున విడుదల అవుతుంది. నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ ఈ సినిమాకు దక్కుతుంది కానీ, ఎలాంటి పండుగ దినాల అడ్వాంటేజ్ ఈ సినిమాకు వచ్చే అవకాశం లేదు. కాకపోతే అన్ని భాషల్లోనూ ఎలాంటి పోటీ లేకుండా సోలో గా విడుదలయ్యే అవకాశం ఈ చిత్రానికి దక్కుతుంది. భారీ క్రేజ్ ఉన్న పాన్ ఇండియన్ చిత్రం కావడంతో ఈ సినిమాకు సీజన్ తో పని లేదు. ఈ సినిమా వచ్చినప్పుడే పండుగ వాతావరణం కనిపిస్తాది. ‘దేవర’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని, దాదాపుగా 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టిన ఎన్టీఆర్, ఈ సినిమాతో కచ్చితంగా వెయ్యి కోట్ల గ్రాస్ ని కొల్లగొడుతుందని అంటున్నారు.
ఇప్పటి వరకు సోలో హీరోగా కేవలం ప్రభాస్, అల్లు అర్జున్ వంటి హీరోలు మాత్రమే వెయ్యి కోట్ల గ్రాస్ మార్కుని అందుకున్నారు. వచ్చే ఏడాది ఎన్టీఆర్ కూడా ఈ లిస్ట్ లో చేరబోతున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ నటించిన ‘వార్ 2’ మూవీ ఆగస్టు 14న విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్ రోల్ లో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తో బాలీవుడ్ ఆడియన్స్ కి మరింత చేరువ అయ్యి, ప్రశాంత్ నీల్ సినిమా విడుదల అయ్యే సమయానికి నార్త్ ఇండియా లో జెండా పాతాలని ఎన్టీఆర్ ప్లాన్. మరి ఆయన వ్యూహం ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా వచ్చే నెలలో ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్ కూడా అధికారికంగా రానుంది.
Also Read : ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ నుండి బ్లాస్టింగ్ అప్డేట్ వచ్చేసింది!
…
The Most striking tale ever to erupt from the Soil of Indian CinemaA special glimpse for the Man of Masses @tarak9999’s birthday.#NTRNeel pic.twitter.com/xg6AjsEUbS
— #NTRNeel (@NTRNeelFilm) April 29, 2025