https://oktelugu.com/

Mahindra XUV 700 : మహీంద్రా కారు ప్రియులకు బంపర్ ఆఫర్.. ఆ కారుపై ఏకంగా రూ.1.80 లక్షల తగ్గింపు..

దేశంలో ప్రముఖ కంపెనీల్లో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఒకటి. మిగతా కంపెనీలకు గట్టి పోటీ ఇస్తూ ఎస్ యూవీలను మార్కెట్లోకి తీసుకురావడంలో సక్సెస్ అవుతుంది. మహీంద్రానుంచి SUV XUV 700 మోడల్ ఈ ఇయర్ ది బెస్ట్ కారుగా నిలిచింది. 2024 కార్ల విక్రయాల్లో ఈ మోడల్ రెండో స్థానంలో నిలిచింది.

Written By:
  • Srinivas
  • , Updated On : October 15, 2024 / 01:52 PM IST

    Mahindra XUV 700

    Follow us on

    Mahindra XUV 700 : SUV కారు కొనాలని అనుకుంటే మహీంద్రా అండ్ మహీంద్రా కార్లు ది బెస్ట్ అని కొందరు అంటుంటారు. కాస్త ధర ఎక్కవైనా ఈ కార్లు స్పోర్ట్స్ లుక్ తో ఆకర్షిస్తాయి. అంతేకాకుండా సేప్టీ విషయంలో మహీంద్రా కార్లు ముందుంటాయి. సాధారణంగా మహీంద్రా కంపెనీ కార్ల ధరలను తగ్గించడంలో గానీ.. డిస్కౌంట్లు ఇవ్వడంలో మిగతా కార్ల కంటే వెనుకే ఉంటుంది. కానీ ఇటీవల ఈ కంపెనీకి చెందిన ఓ మోడల్ పై భారీగా తగ్గింపు ప్రకటించింది. ఈ మోడల్ సేల్స్ లో వృద్ది సాధించినప్పటికీ దీనిపై ఏకంగా రూ.1.80 లక్షల డిస్కౌంట్ ను ప్రకటించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. గత ఏడాదితో పోలిస్తే ఈ కారు అమ్మకాలు పెరిగాయి. అయినా దీనిని తక్కువ ధరకు ఇవ్వడంతో కొందరు దీనిని సొంతం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకీ ఆ కారు ఏదో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వివరాల్లోకి వెళ్లండి..

    దేశంలో ప్రముఖ కంపెనీల్లో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఒకటి. మిగతా కంపెనీలకు గట్టి పోటీ ఇస్తూ ఎస్ యూవీలను మార్కెట్లోకి తీసుకురావడంలో సక్సెస్ అవుతుంది. మహీంద్రానుంచి SUV XUV 700 మోడల్ ఈ ఇయర్ ది బెస్ట్ కారుగా నిలిచింది. 2024 కార్ల విక్రయాల్లో ఈ మోడల్ రెండో స్థానంలో నిలిచింది. అంతేకాకుండా సెప్టెంబర్ నెలలో ఈ మోడల్ 9,646 యూనిట్ల విక్రయాలు జరుపుకుంది. గత ఏడాది అంటే 2023 సెప్టెంబర్ లో ఈ మోడల్ ను 8,555 మంది కొనుగోలు చేశారు. వార్షిక వృద్ధితో పాటు నెలవారీ అమ్మకాల్లో మహీంద్రా SUV XUV 700 ది బెస్ట్ గా నిలిచింది. వార్షిక వృద్ధి రేటు 12.75 శాతం ఉండగా ఓవరాల్ కార్ సేల్స్ లో 18.89 శాతం నమోదైంది.

    SUV XUV 700 కారు ఇంజిన్ గురించి పరిశీలిస్తే ఇందులో 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది 200 బీహెచ్ పీ పవర్ తో పాటు 380 టార్క్ ను రిలీజ్ చేస్తుంది. ఇందులో 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ కూడా ఉంది. ఇది 185 బీహెచ్ పీ పవర్, 450 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. రెండు ఇంజన్లు 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేస్తారు. ఈ మోడల్ మొత్తం 6 వేరియంట్లలో అందుబాటులో ఉంది.

    మహీంద్రా SUV XUV 700 ఇన్నర్ లో 10.2 అంగుళాల టచ్ స్క్రీన్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్ డిస్ ప్లేను కలిగి ఉంది. ఈ మోడల్ ప్రత్యేకత ఏంటంటే పనోరమిక్ సన్ రూప్. ఆటోమేటిక్ డ్యూయల్ జోన్ క్లైమేట్, వెంటిలేటేడ్ ప్రంట్ సీట్, అలెక్సా, కనెక్టివిటీ ఉన్నాయి. సేప్టీలోనూ ఈ కారు ప్రత్యేకతను కలిగి ఉంది. ఇందులో మొత్తం 7 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అలాగే ఆడాస్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్రియర్ పార్కింగ్ బ్రేక్, 360 డిగ్రీ కెమెరాను కలిగి ఉంది. ఈ కారును రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. టాప్ ఎండ్ మోడల్ రూ.26.99 లక్షల ధర పలుకుతోంది. ఈ మోడల్ పై ప్రస్తుతం రూ.1.80 లక్షల డిస్కౌంట్ ను ప్రకటించారు.