Pushpa 2: మావోయిస్టుల ప్రాంతంలో ‘పుష్ప’ ప్రభంజనం..ఈ ప్రాంతం ఎంత భయంకరమైనదో తెలుసా? పూర్తి వివరాలు చూస్తే వణికిపోతారు!

'కోల్ కత్తా లోని ఒక మావోయిస్టు ప్రాంతం ఉంది. ఇక్కడ జనాలు తిరిగేందుకే భయపడుతారు. రాత్రి సమయాల్లో బయట ఎవ్వరూ కనిపించారు. అక్కడి ప్రభుత్వం కూడా ఆ ప్రాంతంలో సెకండ్ షోస్ ని నిషేదించారు. అలాంటి ప్రాంతంలో పుష్ప చిత్రం 50 రోజులు ఆడింది. బాలీవుడ్ లో పుష్ప సృష్టించిన ప్రభంజనం అలాంటిది.

Written By: Vicky, Updated On : October 15, 2024 1:54 pm

Pushpa 2(3)

Follow us on

Pushpa 2: పాన్ ఇండియా లెవెల్ లో సంచలనం సృష్టించిన చిత్రాలలో ఒకటి పుష్ప. ముందుగా ఈ సినిమాని అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల చేయాలని అనుకోలేదు. కానీ అల్లు అర్జున్ పట్టుబట్టి మరీ ఈ సినిమాని ఇతర భాషల్లోకి దబ్ చేయించి విడుదల చేసాడు. ఇక తర్వాత ఎలాంటి అద్భుతాలు జరిగాయో మన కళ్లారా చూసాము. ఇప్పటికీ ఈ సినిమా ప్రభావం జనాల మీద ఇంకా తగ్గలేదు. పుష్ప చిత్రంలోని మ్యానరిజమ్స్ ని కానీ, ‘తగ్గేదేలే’ అనే డైలాగ్ ని కానీ ప్రతీ రోజు ఎదో ఒక సందర్భంలో మనకి తెలియకుండానే వాడేస్తూ ఉంటాము. జనాలను తన నటనతో, మ్యానరిజమ్స్ తో ఈ స్థాయి మ్యాజిక్ క్రియేట్ చేసాడు కాబట్టే, అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి పీఆర్ గా పనిచేసిన ‘బేబీ’ చిత్ర నిర్మాత ఎస్ కె ఎన్ పుష్ప ప్రభంజనం గురించి ప్రస్తావిస్తూ నిన్నటి ప్రెస్ మీట్ లో చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఆయన మాట్లాడుతూ ‘కోల్ కత్తా లోని ఒక మావోయిస్టు ప్రాంతం ఉంది. ఇక్కడ జనాలు తిరిగేందుకే భయపడుతారు. రాత్రి సమయాల్లో బయట ఎవ్వరూ కనిపించారు. అక్కడి ప్రభుత్వం కూడా ఆ ప్రాంతంలో సెకండ్ షోస్ ని నిషేదించారు. అలాంటి ప్రాంతంలో పుష్ప చిత్రం 50 రోజులు ఆడింది. బాలీవుడ్ లో పుష్ప సృష్టించిన ప్రభంజనం అలాంటిది. ఆ సినిమాకి ప్రస్తుతం ఉన్న రీచ్ ఒకప్పుడు బాహుబలి సిరీస్ కి కూడా ఉండేది కాదట. ఇప్పుడు అక్కడి ఆడియన్స్ ‘పుష్ప 2′ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పుష్ప 2 లో కొన్ని సన్నివేశాలు చూసాను. అల్లు అర్జున్ డబ్బింగ్ చెప్పేటప్పుడు నా రోమాలు నిక్కపొడుచుకున్నాయి.ఈ సినిమాని పూర్తి స్థాయిలో ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆతృతగా ఎదురు చూస్తున్నాను’ అంటూ ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.

ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది డిసెంబర్ 6న ఈ చిత్రాన్ని మేకర్స్ విడుదల చేయబోతున్నట్టు ఇది వరకే అధికారిక ప్రకటన చేసారు. అయితే ఇప్పుడు ఇప్పుడు ఒక రోజు ముందే విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఎందుకంటే డిసెంబర్ 6 వ తేదీన బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘చావా’ విడుదల అవ్వబోతుంది. ఆ సినిమాతో క్లాష్ కి వెళ్తే మొదటి రోజు తక్కువ షోస్ కారణంగా ఓపెనింగ్స్ పై ప్రభావం పడే అవకాశం ఉంటుందని, అందుకే ఒకరోజు ముందుకు జరగాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తుంది. డిసెంబర్ 4 రాత్రి 9 గంటల 30 నిమిషాల నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో నాన్ స్టాప్ షోస్ ని ప్లాన్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. అందుకు తగ్గట్టుగా ఇప్పటి నుండే ప్లానింగ్స్ మొదలు పెట్టారట. మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ నుండి 100 కోట్ల రూపాయిల షేర్ మార్కుని అందుకునేలా ప్లానింగ్స్ చేస్తున్నారట మేకర్స్.