Budget Cars: కాలం మారుతున్న కొద్దీ టెక్నాలజీ మారుతోంది. నేటి వినియోగదారులకు అనుగుణంగా కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఒకప్పుడు కారు వెళ్లాలంటే డ్రైవర్ నైపుణ్యవంతుడు కలిగి ఉండాలి. కానీ ఇప్పుడు కారులో ఉండే టెక్నాలజీ అప్డేట్ కావడంతో డ్రైవింగ్ ఈజీ అవుతోంది. కొత్తగా కారు నడపాలని అనుకునేవారు సైతం లేటేస్ట్ కార్లను ఈజీగా డ్రైవ్ చేయగలుగుతున్నారు. అయితే ఇటీవల కొన్ని కార్లలో ఓ కొత్త టెక్నాలజీని అమర్చి అందరినీ ఆకర్షిస్తున్నారు. దానిపేరే.. Head Of Display(HUD). ఇది ఒకప్పుడు విమానాల్లో మాత్రమే కనిపించేది. ముఖ్యంగా యుద్ద విమానాల్లో ఈ టెక్నాలజీ ఉపయోగించి స్పీడ్, నావిగేషన్, ఇంజిన్ పనితీరును తెలుసుకునేవారు. ఆ తరువత దీనిని ఇతర వాహనాల్లోకి మార్చారు. ఇప్పుడు దీనిని కొన్ని కార్లలోకి తీసుకొచ్చారు. ఈ టెక్నాలజీ ఆధారంగా డ్రైవర్ బయటవైపు చూడకుండానే రోడ్డు పరిస్థితి తెలుసుకోగలడు. అయితే ఈ టెక్నాలజీ ఇప్పుడు తక్కువ బడ్జెట్ కార్లలో ఉండడం విశేషం. ఇంతకీ ఇది ఏ కార్లలో ఉందంటే?
Also Read: యూత్ కు తెగ నచ్చే టాటా ‘డార్క్’ ఎడిషన్.. ఇప్పుడు అందుబాటలో
దేశంలో అగ్రగామిగా సేల్స్ నమోదు చేసుకుంటున్న కార్లలో మారుతి సుజుకీ కంపెనీ ఎప్పుడూ టాప్ లెవల్లో ఉంటోంది. ఈ కంపెనీ కార్లు ఎప్పుడూ లో బడ్జెట్ లో అందుబాటులో ఉంటాయని చాలా మంది వినియోగదారుల నమ్మకం. అయితే ఇటీవల ఈ కంపెనీకి చెందిన కొన్ని లో బడ్జెట్ కార్లలో Head Of Display టెక్నాలజీని అమర్చారు. ఈ కంపెనీకి చెందిన బాలెనో కారులో ఇది కనిపిస్తుంది. ఈ మోడల్ మాన్యువల్ తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ లో పనిచేస్తుంది. బాలెనో గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ మోడల్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ను అందిస్తోంది. దీనిని ప్రస్తుతం మార్కెట్లో రూ.9.42 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. ఇదే కంపెనీకి చెందిన ఫ్రాంక్స్ కారులోనూ ఈ ఫీచర్ ఉంది. ఫ్రాంక్స్ ఇంజిన్ 1.2 లీటర్ పెట్రోల్, డీజిల్ డ్యూయెల్ జెట్ ను అందిస్తుంది. ఇది పెట్రోల్ ఇంజిన్ పై 89.73 బీహెచ్ పీ పవర్, 113 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారును రూ.11.48 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. అలాగే మారుతికి చెందిన బ్రెజ్జాలోనూ HUD టెక్నాలజీని అమర్చారు. ఈ మోడల్ మార్కెట్లో రూ.19.89 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.
మారుతి కంపెనీ తరువాత గట్టి పోటీ ఇస్తున్న కంపెనీ టోయోటా. ఈ కంపెనీకి చెందిన గ్లాంజూ అనే మోడల్ లో HUD టెక్నాలజీని అమర్చారు. ఇందులో మాన్యువల్ తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ గేర్ బాక్స్ ను అమర్చారు. ఈ మోడల్ లో టాప్ స్పెక్ వి ట్రిమ్ HUDని కలిగి ఉంది. గ్లాంజూ మోడల్ ఇంచుమించి మారుతి బాలెనో ఫీచర్ ను కలిగి.. అంతే ధరతో మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇదే కంపెనీకి చెందిన టైజర్ లోనూ HUD టెక్నాలజీని అమర్చారు. ఇందులో వి ట్రిమ్ లో HUD టెక్నాలజీని అమర్చారు. ఇక హ్యుందాయ్ వెర్నా, కియా సెల్టోస్ వంటి కార్లలోనూ ఈ టెక్నాలజీ అందుబాటులో ఉంది.