Good Bad Ugly : రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ'(Good Bad Ugly Movie) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని విజయవంతంగా థియేటర్స్ లో నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవల కాలం లో థియేటర్స్ లో విడుదలైన అజిత్(Thala Ajith) అన్ని సినిమాలకంటే ఈ చిత్రం అభిమానులను ఎంతగానో అలరించింది. అభిమానులు అజిత్ నుండి ఎలాంటి అంశాలు అయితే కోరుకుంటారో, అలాంటి అంశాలన్నీ ఈ చిత్రంలో పొందుపరిచాడు డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్. అందుకే ఈ చిత్రానికి బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురుస్తుంది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 52 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన ఈ సినిమా, మొదటి 5 రోజుల్లో 172 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిందట.
Also Read : 2 రోజుల్లో 80 కోట్లు..చరిత్ర తిరగరాసిన అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’!
అయితే ఈపాటికి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని దాటేసింది అందరూ అనుకుంటున్నారు.
అలా అనుకుంటే ముమ్మాటికీ అది పొరపాటే. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కి ఆమడదూరం లో ఉంది. ఈ వారం మొత్తం బాగా ఆడితే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మొదటి నుండి ఈ చిత్రం పై అంచనాలు భారీ రేంజ్ లో ఉండడంతో ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 116 కోట్ల రూపాయలకు జరిగింది. 172 కోట్ల రూపాయిల గ్రాస్ మన తెలుగు సినిమాకు వస్తే షేర్ దాదాపుగా 100 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. కానీ తమిళనాడు లో ఎంటర్టైన్మెంట్ టాక్స్ భారీగా ఉంటుంది, అదే విధంగా థియేటర్స్ యాజమాన్యాలు కూడా కమీషన్స్ భారీ రేంజ్ లో తీసుకుంటారు. అందుకే తమిళనాడు లో వచ్చే గ్రాస్ వసూళ్లకు, షేర్ వసూళ్లకు అసలు సంబంధమే ఉండదని అందరు అంటుంటారు. ఈ చిత్రానికి ఇప్పటి వరకు 84 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి.
బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి లాభాల్లోకి రావాలంటే కచ్చితంగా మరో 32 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. నేడు వర్కింగ్ డే కావడంతో ఈ సినిమాకు యావరేజ్ రేంజ్ హోల్డ్ మాత్రమే దక్కింది. చూస్తుంటే ఈ బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి ఈ వారం మొత్తం అవసరం అయ్యేలా ఉంది. ఈ చిత్రానికి ఉన్న లక్ ఏమిటంటే ఈ నెల మొత్తం చెప్పుకోదగ్గ పెద్ద హీరోల సినిమాలు విడుదల లేవు. కాబట్టి మే 1 వరకు ఈ సినిమాకు మంచి వసూళ్లు వస్తాయనే నమ్మకం తో ఉన్నారట బయ్యర్స్. కళ్ళు చెదిరిపోయే రేంజ్ భారీ లాభాలు కచ్చితంగా రాకపోవచ్చు కానీ, మంచి లాభాలు మాత్రం వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా రేంజ్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది.
Also Read : ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఫుల్ మూవీ రివ్యూ…