https://oktelugu.com/

నర్సింగ్ యాదవ్ చివరి కోరిక తీరకుండానే చనిపోయారట!

వెండితెరపై తెలంగాణ గుండాగా పేరుగాంచి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు నర్సింగ్ యాదవ్ (52) ఇటీవలే చనిపోయిన సంగతి తెలిసిందే. చాలా కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్న ఆయన.. సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించిన నర్సింగ్‌ యాదవ్.. 300లకు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. Also Read: మోనాల్ కి జ్ఞాపకమే మిగిలింది ! ఆయన స్వస్థలం హైదరాబాద్‌.. 1963 మే 15న […]

Written By:
  • NARESH
  • , Updated On : January 19, 2021 7:22 pm
    Follow us on

    Nursing Yadav

    వెండితెరపై తెలంగాణ గుండాగా పేరుగాంచి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు నర్సింగ్ యాదవ్ (52) ఇటీవలే చనిపోయిన సంగతి తెలిసిందే. చాలా కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్న ఆయన.. సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించిన నర్సింగ్‌ యాదవ్.. 300లకు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు.

    Also Read: మోనాల్ కి జ్ఞాపకమే మిగిలింది !

    ఆయన స్వస్థలం హైదరాబాద్‌.. 1963 మే 15న హైదరాబాద్‌లో రాజయ్య, లక్ష్మీ నరసమ్మ దంపతులకు జన్మించాడు. ఆయనకు భార్య చిత్ర, కొడుకు రుత్విక్ యాదవ్ ఉన్నారు.

    అయితే నర్సింగ్ భార్య చిత్ర తాజాగా మీడియాతో మాట్లాడూ కొన్ని విషయాలను వెల్లడించింది. తమది పెద్దలు కుదిర్చిన లవ్ మ్యారేజ్ అని 2000 సంవత్సరంలో నవంబర్ తమ వివాహం జరిగిందని తెలిపింది. తిరుపతిలో సాప్ట్ వేర్ ఉద్యోగం చేసేటప్పడు నర్సింగ్ యాదవ్ ను తొలిసారి చూశానని చెప్పకొచ్చింది. అలాగే తనను పెళ్లి చేసుకుంటానని మొదట నర్సింగ్ యాదవ్ అడిగారిన అతని నమ్మకంతో అంగీకరించానని చిత్ర తెలిపింది.

    Also Read: ‘పవిత్ర’ ఆంటీ అలవాట్లు పై క్లారిటీ !

    అయితే రుత్విక్ సినిమాల్లో నటించాలని నర్సింగ్ చెప్పేవారని కానీ చివరి కోరిక తీరకుండానే చనిపోయాని ఆవేదన వ్యక్తం చేసింది. రుత్విక్ యాదవ్ బీటెక్ చదువుతున్నాడని సినిమాలపై అస్సలు ఆసక్తి లేదని తెలిపింది చిత్ర.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్