Homeబిజినెస్Boda Kakarakaya Farming: ఈ పంటతో కేవలం 3 నెలలలో ఎకరానికి రూ.5 లక్షలు లాభం.....

Boda Kakarakaya Farming: ఈ పంటతో కేవలం 3 నెలలలో ఎకరానికి రూ.5 లక్షలు లాభం.. మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్న పంట ఇదే..

Boda Kakarakaya Farming: ఇటువంటి అధిక లాభాలను ఇచ్చే పంటలలో బోడా కాకరకాయ పంట కూడా ఒకటి. ఈ పంటను సాగు చేస్తే మీరు చాలా తక్కువ వ్యవధిలో అధిక లాభాలను పొందవచ్చు. ఇది చూడడానికి ఆకర్షణీయంగా లేకపోయినా కూడా మాంసం కంటే ఇది 50 రేట్లు శక్తివంతమైనదిగా భావిస్తారు. బోడ కాకరకాయలో అధిక మొత్తంలో విటమిన్ బి12, విటమిన్ డి, జింక్, కాపర్, క్యాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. కాబట్టి ఈ పంటను సాగు చేసినట్లయితే తక్కువ వ్యవధిలో ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉంది. కాకరకాయలలో ఉండే రకాలలో బోడా కాకరకాయకు మార్కెట్లో చాలా డిమాండ్ ఉంటుంది. చిన్నగా ముల్లులతో బోడ కాకరకాయ ఉంటుంది. ఈ బోడ కాకరకాయ శాస్త్రీయ పేరు ముమైర్దిక డివైకా. మనదేశంలో పర్వత ప్రాంతాలలో ఈ బోడో కాకరకాయ ఎక్కువగా సాగు చేస్తారు. ఆ ప్రాంతాలలో దీనిని కంకోడా, కటోల, పరోప, డేదాస అని కూడా పిలుస్తూ ఉంటారు. సాధారణంగా అయితే దీనిని ఎక్కువగా అన్ని ప్రాంతాలలో వన కారేలా అని పిలుస్తారు.

బోడ కాకరకాయ సాగు చేయాలంటే నేల పిహెచ్ విలువ 5.5 నుంచి 6.5 మధ్య ఉండేలాగా చూసుకోవాలి. ఇసుకతో కలిపిన లోమ మట్టి ఉంటే ఇది బాగా సాగు అవుతుంది. రెండు మూడు సార్లు పొలాన్ని లోతుగా దున్నాలి. పొలంలో పది నుంచి 15 టన్నుల బాగా కుళ్ళిన పశువుల ఎరువును ప్రతి హెక్టార్కు కలపాలి. రెండు వరుసల మధ్య దూరం 1 లేదా 2 మీటర్లు ఉండేలాగా చేసుకోవాలి. మొక్కకు మొక్కకు మధ్య దూరం కూడా 60 నుంచి 90 సెంటీమీటర్ల వరకు ఉండాలి. రబీ లేదా ఖరీఫ్ సీజన్లో ఈ విత్తనాలను వేసుకోవాలి. వేసవిలో ఈ విత్తనాలను వేయాలి అనుకుంటే జనవరి లేదా ఫిబ్రవరి నెలలో చల్లని ప్రదేశాలలో దీనిని సాగు చేయవచ్చు.

ఒకవేళ వర్షాకాలంలో అంటే జూలై నుంచి ఆగస్టు నెలలో ఈ విత్తనాలను వేసుకోవచ్చు. ఒక ఎకరానికి బోడ కాకరకాయ విత్తనాలు ఒకటి నుంచి రెండు కిలోల వరకు అవసరం అవుతాయి. నివేదికల ప్రకారం మీరు ప్రతి ఎకరాకు కూడా ఐదు టన్నుల వరకు బోడ కాకరకాయ ఉత్పత్తి పొందవచ్చు. అనేక ఆరోగ్య సమస్యలకు బోడా కాకరకాయ కూరగాయ పరిష్కారంగా పనిచేస్తుంది. జుట్టు ఊడిపోవడం, చెవి నొప్పి, దగ్గు, తలనొప్పి, కడుపు సమస్యలు వంటి అనేక సమస్యలకు బోడా కాకరకాయ బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా పైల్స్, జాండీస్ వంటి వ్యాధులను న్యాయం చేయడంలో కూడా ఇది బాగా సహాయపడుతుంది. మధుమేహం ఉన్నవారికి బోడా కాకరకాయ చాలా అద్భుతమైన ప్రయోజనాలను కలిగిస్తుంది.

Mahi
Mahihttp://oktelugu.com
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular