
మనలో చాలామంది గుర్రపుడెక్క మొక్కల గురించి వినే ఉంటారు. చెరువుల్లో ఇబ్బడిముబ్బడిగా పెరిగే మొక్కలలో గుర్రపుడెక్క మొక్కలు కూడా ఉన్నాయి. నీళ్లలో తేలియాడే మొక్క అయిన గుర్రపు డెక్క నీటిలోని ఆక్సిజన్ తో పాటు నీళ్లలో ఉన్న విషపదార్థాలను కూడా పీల్చుకుంటుంది. గుర్రపు డెక్క మొక్కలు ఉన్న నీటిలో చేపలు కూడా జీవించలేవు. చెరువులోని నీళ్లపై ఈ మొక్కలు కనిపిస్తే ఆ చెరువు కొన్ని రోజుల్లోనే మట్టిదిబ్బగా మారిపోయే అవకాశాలు అయితే ఉంటాయి.
అయితే ఈ మొక్కల వల్ల లాభాలు కూడా ఉన్నాయి. ఈ మొక్కల ద్వారా చాలామంది సులభంగా లక్షల రూపాయలు సంపాదిస్తుండటం గమనార్హం. ఈ మొక్కలతో ఉత్పత్తులను తయారు చేయడంతో పాటు భారీ మొత్తంలో లాభాలను సంపాదిస్తున్నారు. గుర్రపుడెక్క మొక్క చెరువులో ఒకచోటు నుంచి మొదలై చెరువు అంతటా వ్యాపిస్తుంది. చేపల చెరువుల పెంపకం దారులు ఒకప్పుడు ఈ మొక్క వల్ల భారీ మొత్తంలో నష్టాలను పొందారు.
అయితే ఇప్పుడు మాత్రం గుర్రపుడెక్క మొక్కల నుంచి యోగా మ్యాట్స్ తయారు చేయడం ద్వారా ఎక్కువ మొత్తం సంపాదిస్తున్నారు. గుర్రపుడెక్క మొక్కలతో ఇతర వస్తువులను కూడా తయారు చేస్తూ పెద్ద వ్యాపార సామ్రాజాన్ని వీళ్లు సృష్టించుకుంటూ ఉండటం గమనార్హం. అస్సాం రాష్ట్రంలోని దీపోర్ బీల్ గ్రామంలో ఉన్న కొందరు బాలికలు గుర్రపు డెక్క మొక్కలతో అద్భుతాలు చేస్తున్నారు.
దీపోర్ బీల్ సరస్సు మొత్తం గుర్రపు డెక్క మొక్కలతో నిండిపోగా నార్త్ ఈస్ట్ టెక్నాలజీ అప్లికేషన్ లెర్నింగ్ సెంటర్ గుర్రపు డెక్క మొక్కల నుంచి యోగా మ్యాట్స్ తయారు చేయడానికి సంబంధించిన శిక్షణ ఇచ్చింది. ఈ మొక్కల నుంచి తయారు చేసిన యోగా మ్యాట్స్ పర్యావరణానికి కూడా ఎలాంటి హాని చేయవని తెలుస్తోంది.