Gautam Adani: సౌర విద్యుత్తు తయారీ ప్రాజెక్టుకు సంబంధించిన ఇష్యూలో వీరంతా కూడా అడ్డదారులు తొక్కారని.. 20 సంవత్సరాలలో రెండు బిలియన్ డాలర్ల లాభం పొందగల సౌరశక్తి ఒప్పందాలను పొందడానికి దొడ్డి దారిన వెళ్లారని.. భారత ప్రభుత్వం అధికారులకు ఏకంగా 265 మిలియన్ డాలర్లు లంచాలుగా చెల్లించారనే అభియోగాలు తెరపైకి వచ్చాయి.. అంతేకాదు అదానీ గ్రీన్ ఎనర్జీలో అక్రమ మార్గాలలో. అప్పులు తీసుకొచ్చారని.. పెట్టుబడులు సేకరించారని న్యూయార్క్ అధికారులు తాము మోపిన అభియోగాలలో పేర్కొన్నారు. మూడు బిలియన్ డాలర్లకు పైగా రుణాలను, ఇతర బాండ్లను అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ లోకి అక్రమంగా సేకరించారని న్యూయార్క్ అధికారులు అభియోగాలు మోపారు. ” భారతదేశపు అతిపెద్ద సౌర విద్యుత్ తయారీ ప్రాజెక్టును అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వ అధికారులకు 265 మిలియన్ డాలర్లు లంచాలుగా చెల్లించడానికి అంగీకరించారు. ఈ పథకంలో బాగానే గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్, మరో ఏడుగురు ఇందులో నిందితులుగా ఉన్నారని” న్యూయార్క్ అధికారులు పేర్కొంటున్నారు.
ఏమిటీ కేసు
అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అనే కంపెనీ సౌరశక్తి ద్వారా విద్యుత్ తయారు చేయడానికి ముందుకు వచ్చింది. మరో కంపెనీతో కలిసి ఈ కార్యకలాపాలు సాగిస్తామని ప్రకటించింది. సుమారు 12 గిగావాట్ల సౌర శక్తిని భారత ప్రభుత్వానికి విక్రయించేందుకు రంగం సిద్ధం చేసుకుంది.. ఇది లక్షలాది ఇళ్లు, కార్యాలయాలకు విద్యుత్ ను సరఫరా చేస్తుంది.. అయితే ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టినవారు భారత అధికారులకు 265 మిలియన్ డాలర్లు లంచాలుగా ఇచ్చారని న్యూయార్క్ అధికారులు అభియోగాలు మోపారు.. భారీగా ఇంధన సరఫరా ఒప్పందాలను పొందడానికి వారు ఈ అడ్డదారులతోక్కారని న్యూయార్క్ డిప్యూటీ అసిస్టెంట్ అటార్నీ జనరల్ లిసా మిల్లర్ పేర్కొన్నారు.. అదానీ గ్రూప్ పై కేసులు బ్రూక్లిన్ లోని ఫెడరల్ కోర్టులో దాఖలయ్యాయి. గౌతమ్ అదానితోపాటు అతడి మేనల్లుడు సాగర్ అదాని, మరో ఏడుగురుపై కేసు నమోదు అయింది. ఇందులో కంపెనీ సీఈవోగా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు మేనేజింగ్ డైరెక్టర్ గా కొనసాగుతున్న వినీత్ జైన్ కూడా ఉపయోగాలు ఎదుర్కొంటున్నారు. అయితే దీనిపై అదాని గ్రూపు, అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ఇంతవరకు స్పందించలేదు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి న్యూయార్క్ అధికారులు అదాని గ్రూప్, ఆ కంపెనీకి సంబంధించిన న్యాయవాదులకు తాము మోపిన అభియోగాలను మెయిల్స్ ద్వారా పంపించారు.. అయితే దీనిని అదాని తరపు న్యాయవాది సీన్ హెకర్ తోసిపుచ్చారు. తమకు అలాంటి ఈ మెయిల్స్ రాలేదని ప్రకటించారు. కాగా, బ్లూమ్ బర్గ్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలో అత్యంత సంపన్నమైన వ్యాపారవేత్తల జాబితాలో గౌతమ్ అదాని 19వ స్థానంలో ఉన్నారు. ఆయన కంపెనీల విలువ 85.5 బిలియన్ డాలర్లు. హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత గౌతమ్ అదాని తన సంపదను క్రమంగా కోల్పోతున్నారు. 2022 నుంచి ఆయన నికర ఆస్తుల విలువ తగ్గిపోతుంది.