https://oktelugu.com/

Bigg Boss Telugu 8: నిఖిల్, రోహిణిలను ముంచేసిన విష్ణు ప్రియ.. మాస్టర్ స్ట్రోక్ ఇచ్చిన నబీల్!

అంతకు ముందు కూడా ఆమె నిఖిల్ తో పృథ్వీ టీ షర్ట్ సేఫ్ గా ఉంచేందుకు డీలింగ్ పెట్టుకుంటుంది. కానీ నిఖిల్ టీ షర్ట్ ని కాపాడడం కోసం ఆమె ఎలాంటి ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. ఆయన టీ షర్ట్ చిరిగిపోయి రేంజ్ ప్రమాదం జరిగింది కానీ తృతి లో తప్పింది.

Written By:
  • Vicky
  • , Updated On : November 21, 2024 / 08:59 AM IST

    Bigg Boss Telugu 8(235)

    Follow us on

    Bigg Boss Telugu 8: ఈ వారం ఎందుకో విష్ణు ప్రియ కాస్త బలుపుతో వ్యవహరిస్తున్నట్టుగా అనిపిస్తుంది. మన అందరికీ తెలిసిందే, విష్ణు తన కోసం కంటే కూడా ఎక్కువగా పృథ్వీ కోసమే ఆడుతుంది. సందర్భం వచ్చినప్పుడు తన కోసం కూడా బాగానే ఆడుతుంది కానీ, పృథ్వీ కోసం ఆడుతున్నప్పుడు ఆమెలో కనపడే కసి వేరు. నిన్న జరిగింది అదే. పృథ్వీ టీ షర్ట్ చిరిగిపోకుండా ఉండడం కోసం ఈమె యష్మీ ని విసిరి అవతలకు వేసింది. ముఖ్యంగా ఆమె అరికాళ్లను పట్టుకొని ఆపిన తీరుకి యష్మీ కి బాగా గాయాలు అయ్యాయి. ఆమె నడవలేని పరిస్థితి కూడా వచ్చింది. ఆ రౌండ్ పూర్తి అయ్యాక యష్మీ ఒక పక్కకి కూర్చొని తన కాళ్ళను సరిచేసుకుంటూ ఉంటుంది. ఆ సమయంలో విష్ణు సూటిపోటి మాటలతో యష్మీ కి చిరాకు కలిగేలా చేస్తుంది. దీంతో ఆమెకి కోపం వచ్చి విష్ణు తో గొడవ పడుతుంది. ఇక్కడ ముమ్మాటికీ విష్ణు ప్రియ ఓవర్ యాక్షన్ వల్లే గొడవ జరిగింది అనేది అర్థం అవుతుంది.

    అంతకు ముందు కూడా ఆమె నిఖిల్ తో పృథ్వీ టీ షర్ట్ సేఫ్ గా ఉంచేందుకు డీలింగ్ పెట్టుకుంటుంది. కానీ నిఖిల్ టీ షర్ట్ ని కాపాడడం కోసం ఆమె ఎలాంటి ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. ఆయన టీ షర్ట్ చిరిగిపోయి రేంజ్ ప్రమాదం జరిగింది కానీ తృతి లో తప్పింది. నబీల్ టీ షర్ట్ కోసం కూడా ఆమె ఎలాంటి పోరాటం చేయలేదు. కేవలం పృథ్వీ టీ షర్ట్ కోసం, తన టీ షర్ట్ కోసం మాత్రమే ఆడింది. మిగిలిన రౌండ్స్ లో ఎవరి కోసం ఆడకుండా చాలా సైలెంట్ గా ఒక మూలాన కూర్చుంది. అయితే విష్ణు ప్రియ టీ షర్ట్ ని చివర్లో నబీల్ కొన్ని కారణాల వల్ల స్విమ్మింగ్ పూల్ లోకి దూకి సేవ్ చేస్తాడు. దీంతో విష్ణు ప్రియ మెగా చీఫ్ కంటెండర్ అవుతుంది. ఇదంతా పక్కన పెడితే అన్ని రౌండ్స్ లో సాధ్యమైనంత వరకు సేఫ్ గా సైలెంట్ గా కూర్చున్న విష్ణు ప్రియ, గౌతమ్ టీ షర్ట్ ని చింపేదుకు మాత్రం తెగ ఉత్సాహం చూపించింది.

    గౌతమ్ టీ షర్ట్ ని సేవ్ చేసేందుకు రోహిణి తెగ కష్టపడుతుంది. ఈ టాస్క్ మొదలయ్యే ముందు రోహిణి తో ఈమెకు గొడవ జరిగి ఉంటుంది, అది మనసులో పెట్టుకొని రోహిణి కి వ్యతిరేకంగా ఆడిందా?, లేదా గౌతమ్ అంటే మొదటి నుండి పడట్లేదు కాబట్టి అతని కోసం ఆడిందా అనేది చూసే ఆడియన్స్ కి అర్థం కాలేదు. కానీ చివర్లో నిఖిల్, రోహిణి లలో ఎవరో ఒకరిని మాత్రమే మెగా చీఫ్ కంటెండర్ టాస్కుకి ఎంచుకోవాల్సిందిగా బిగ్ బాస్ హౌస్ మేట్స్ ని ఆదేశిస్తాడు. ఆ సమయంలో అధిక శాతం మంది రోహిణి కి సపోర్టు చేయగా, విష్ణు ప్రియ మాత్రం నిఖిల్ కి సపోర్టు చేస్తుంది. ముందుగా రోహిణి కి సపోర్ట్ చేద్దాం అనుకున్నాను కానీ, ఇందాక జరిగిన ఒక సంఘటనలో రోహిణి కారణంగా నా మనసు గాయపడింది, అందుకే నేను నిఖిల్ కి సపోర్ట్ చేస్తున్నాను అని అంటుంది. ఇలా విష్ణు ప్రియ ఆటలు నిన్న కొనసాగాయి.