Site icon OkTelugu

Best Smart Technology Scooters: స్మార్ట్ టెక్నాలజీ కలిగిన బెస్ట్ స్కూటర్లు.. టాప్ 5 ఇవే..

Best Smart Technology Scooters

Best Smart Technology Scooters

Best Smart Technology Scooters: కాలం మారుతున్న కొద్ది టెక్నాలజీ అభివృద్ధి చెందుతోంది. ఇప్పుడు ప్రతి రంగంలో సాంకేతికత తప్పనిసరిగా మారింది. ఆటోమోబైల్ రంగంలో కూడా స్మార్ట్ టెక్నాలజీ కీలకంగా ఉంటుంది. బైక్ లతోపాటు కార్లు, స్కూటర్లలోనూ సాంకేతికత ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా స్కూటర్ల విషయానికి వస్తే డ్రైవింగ్ మోడ్ తో పాటు ఇతర ఫీచర్లు తెలపడానికి డిజిటల్ డిస్ప్లే తప్పనిసరిగా ఉంటుంది. ఈ డిస్ప్లే ఇప్పుడు టచ్ స్క్రీన్ తో కూడుకొని ఉంది. ఇది ఆయా కంపెనీలను బట్టి మారుతూ ఉంటుంది. అయితే వినియోగదారులను ఆకట్టుకునేందుకు రకరకాల డిస్ప్లేలను స్కూటర్లలో ఉంచుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టాప్ టచ్ స్క్రీన్ డిస్ప్లే స్కూటర్లు ఏవో ఇప్పుడు చూద్దాం..

స్కూటర్లలో డిజైన్, ఇంజన్ పనితీరుతో పాటు టెక్నాలజీ కూడా చాలా అవసరం. వినియోగదారులు సమాచారాన్ని అందుకునేందుకు ఈ డిస్ప్లే అద్భుతంగా ఉంటేనే స్కూటర్ల కొనుగోలు పెరుగుతాయి. ఇలాంటి వాటిలో ఎలక్ట్రానిక్ స్కూటర్లను అందించే Ather కంపెనీ Energy స్కూటర్ లో 7 అంగుళాల TTF డిస్ప్లేను చూడవచ్చు. ఇది టచ్ స్క్రీన్ కావడంతో వినియోగదారులు తమకు కావలసిన విధంగా సౌకర్యాలను పొందవచ్చు. ఇందులో మ్యాజిక్ ట్విస్ట్, గూగుల్ మ్యాప్స్, నావిగేషన్, అలెక్సా ఇంటిగ్రేషన్ వంటి ఫీచర్లను రైడర్స్ తమకు అనుకూలంగా మార్చుకోవచ్చు. ప్రస్తుతం ఈ స్కూటర్ ధర రూ.1.46 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది.

ప్రముఖ కంపెనీ TVS కు చెందిన ఐ క్యూబ్ స్కూటర్ లో నూ TTF డిస్ప్లేను అమర్చారు. ఇది 17.78 సెంటీమీటర్ల తో ఉంటుంది. ఇందులో మ్యూజిక్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్టు, యాంటీ థెఫ్టు అలర్ట్, జియో ఫెన్సింగ్ వంటి ఫీచర్లను చూడొచ్చు. దీని ధర మార్కెట్లో రూ.1.58 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. సింపుల్ వన్ అనే స్కూటర్ లోను సెవెన్ అంగుళాల TTF టచ్ స్క్రీన్ డిస్ప్లే అవర్చి ఉంది. ఇందులో ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, నావిగేషన్, మొబైల్ కనెక్టివిటీ వాటి ఫీచర్లు ఉంటాయి. దీని ధర మార్కెట్లో రూ.1.69 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది.

Ather కంపెనీకి చెందిన మరో స్కూటర్ Rizta లో కూడా స్మార్ట్ టెక్నాలజీ తో కలిగిన టిటిఎఫ్ డిస్ప్లే ఉంటుంది. ఇందులో గూగుల్ మ్యాప్స్ నావిగేషన్, క్రాష్ అలర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ.1.30 లక్షల ప్రారంభ ధరలతో అందుబాటులో ఉంది. ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల కంపెనీ ఓలా కు చెందిన S1 Pro Gen 3 స్కూటర్ లో సెవెన్ అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లే చూడొచ్చు. ఇందులో రోడ్డు ట్రిప్పు మోడ్, ఎస్ ఓ ఎస్ అలర్ట్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీనిని రూ.1.54 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.

Exit mobile version