SBI Home Loan: SBI హోంలోన్ వినియోగదారులకు బిగ్ షాక్..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) జూన్ 15 నుంచి అన్ని పదవీకాలాలకు తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ల (ఎంసీఎల్ఆర్)ను 10 బేసిస్ పాయింట్లు లేదంటే 0.1 శాతం పెంచింది.

Written By: Neelambaram, Updated On : June 15, 2024 6:05 pm

SBI Home Loan

Follow us on

SBI Home Loan: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును యథాతథంగా ఉంచింది. కానీ చాలా బ్యాంకులు రుణాలపై వడ్డీని పెంచాయి. ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోమ్ లోన్ రుణంపై వడ్డీని మరోసారి పెంచింది. అంటే ఇప్పుడు లోన్‌పై ఎక్కువ ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఆర్బీఐ ద్రవ్య విధాన సమావేశం ముగిసిన కొన్ని రోజుల తర్వాత ఎస్బీఐ వడ్డీని పెంచుతున్నట్లు ప్రకటించింది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) జూన్ 15 నుంచి అన్ని పదవీకాలాలకు తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ల (ఎంసీఎల్ఆర్)ను 10 బేసిస్ పాయింట్లు లేదంటే 0.1 శాతం పెంచింది. ఎస్బీఐ ఈ దశతో, ఎంసీఎల్ఆర్ కు సంబంధించిన అన్ని రకాల రుణాల ఈఎంఐ పెరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు లోన్‌పై గతంలో కంటే ప్రతీ నెలా ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.

ఎంసీఎల్ఆర్ ఏ పదవీకాలానికి ఎంత?
ఎస్బీఐ పెంపుతో, ఏడాది ఎంసీఎల్ఆర్ 8.65% నుంచి 8.75%కి పెరిగింది, ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ 8.00% నుంచి 8.10%కి పెరిగింది. ఒక నెల, మూడు నెలల ఎంసీఎల్ఆర్ రెండూ 8.20% నుంచి 8.30%కు పెరిగాయి. 6 నెలల ఎంసీఎల్ఆర్ ఇప్పుడు 8.55% నుంచి 8.65%కి పెరిగింది. అదనంగా, రెండేళ్ల ఎంసీఎల్ఆర్ 8.75% నుంచి 8.85%కి పెరిగింది. మూడేళ్ల ఎంసీఎల్ఆర్ ఇప్పుడు 8.85% నుం,ి 8.95%కి పెరిగింది.

రుణాలపై రెపోరేటు ప్రభావం ఎంత?
హోమ్, వెహికిల్ రుణాలతో సహా చాలా వరకు రిటైల్ రుణాలు ఏడాదికి ఎంసీఎల్ఆర్ రేటుతో అనుసంధానించి ఉన్నాయి. ఎంసీఎల్ఆర్ పెరుగుదల ఆర్బీఐ రెపో రేటు లేదా ట్రెజరీ బిల్లు రాబడి వంటి బాహ్య బెంచ్‌మార్క్‌లతో అనుసంధానించబడిన రుణాలను తీసుకునే కస్టమర్లపై ఎలాంటి ప్రభావం చూపదు. అక్టోబర్, 2019 నుంచి, ఎస్బీఐతో సహా బ్యాంకులు ఈ బాహ్య బెంచ్‌మార్క్‌లకు కొత్త రుణాలను లింక్ చేయడం తప్పనిసరైంది.

బాండ్ల ద్వారా 100 మిలియన్ డాలర్లు సమీకరణ
వ్యాపార వృద్ధికి తోడ్పాటు అందించేందుకు ఎస్బీఐ బాండ్ల ద్వారా 100 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 830 కోట్లు) సమీకరించినట్లు శుక్రవారం (జూన్ 14) ప్రకటించింది. మూడేళ్ల మెచ్యూరిటీతో ఫ్లోటింగ్ రేట్ నోట్లు, సంవత్సరానికి +95 బేసిస్ పాయింట్ల సెక్యూర్డ్ ఓవర్‌నైట్ ఫైనాన్సింగ్ రేట్ (సీఏఎఫ్ఆర్) ఎస్బీఐ లండన్ బ్రాంచ్ ద్వారా జూన్ 20, 2024న జారీ చేయనుంది.