Kalki 2898 AD: కల్కి నుండి సడన్ సర్ప్రైజ్… లేటెస్ట్ వీడియో చూశారా?

వివిధ నగరాల్లో బుజ్జిని ప్రదర్శనకు పెడుతున్నారు. ఆనంద్ మహీంద్రా సైతం బుజ్జిని డ్రైవ్ చేశాడు. ఇక జూన్ 10న విడుదలైన ట్రైలర్ మరొక ఎత్తు అని చెప్పాలి.హాలీవుడ్ రేంజ్ విజువల్స్ తో మైండ్ బ్లాక్ చేశారు.

Written By: S Reddy, Updated On : June 15, 2024 6:27 pm

Kalki 2898 AD

Follow us on

Kalki 2898 AD: ప్రభాస్ నటించిన కల్కి 2829 AD విడుదలకు సమయం దగ్గర పడింది. మరో రెండు వారాల సమయం మాత్రమే ఉంది. కల్కి చిత్రాన్ని భారీగా ప్రమోట్ చేస్తున్నారు. కేవలం ప్రమోషన్స్ కి రూ. 200 కోట్లు కేటాయించారని సమాచారం. రామోజీ ఫిల్మ్ సిటీలో రూ. 40 కోట్ల ఖర్చుతో ఓ ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించారు. ఇక ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా ఒక కారును సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర ఈ బుజ్జి(కారు)ని తయారు చేయడానికి అవసరమైన సాంకేతికతను సమకూర్చారు. ఆయన ఇంజనీర్స్ దర్శకుడు నాగ్ అశ్విన్ తో కలిసి పని చేశారు.

వివిధ నగరాల్లో బుజ్జిని ప్రదర్శనకు పెడుతున్నారు. ఆనంద్ మహీంద్రా సైతం బుజ్జిని డ్రైవ్ చేశాడు. ఇక జూన్ 10న విడుదలైన ట్రైలర్ మరొక ఎత్తు అని చెప్పాలి.హాలీవుడ్ రేంజ్ విజువల్స్ తో మైండ్ బ్లాక్ చేశారు. నాగ్ అశ్విన్ ప్రతిభను పలువురు కొనియాడుతున్నారు. కల్కి ప్రభాస్ కెరీర్లో గొప్ప చిత్రం అవుతుందని ఫ్యాన్స్ సైతం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే… ఫ్యాన్స్ కి సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది కల్కి టీమ్. ఓ ప్రమోషనల్ సాంగ్ సిద్ధం చేశారు. స్టార్ సింగర్ దిల్జీత్ ఈ పాటను పాడారు. కల్కి ప్రమోషన్స్ లో భాగంగా ఓ సాంగ్ ప్రత్యేకంగా షూట్ చేశారు. భైరవ యాన్తం పేరుతో వస్తున్న ఈ సాంగ్ లో ప్రభాస్, దిల్జీత్ భాగమయ్యారు. ప్రభాస్ లుక్ అదిరింది. నేడు కేవలం ప్రోమో విడుదల చేశారు. రేపు పూర్తి సాంగ్ అందుబాటులోకి రానుంది.

కల్కి మైథలాజికల్ అండ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ప్రభాస్ భైరవ అనే సాహసోపేత పాత్ర చేస్తున్నారు. దీపికా పదుకొనె హీరోయిన్. అమితాబ్, కమల్ హాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దిశా పటాని మరొక హీరోయిన్. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో రూ. 500 కోట్లకు పైగా బడ్జెట్ తో కల్కి తెరకెక్కింది. అశ్వినీ దత్ నిర్మాతగా ఉన్నారు. జూన్ 27న వరల్డ్ వైడ్ విడుదల కానుంది.