https://oktelugu.com/

Maruti Suzuki: ఈ కార్లపై బిగ్ ఆఫర్స్.. మారుతి సుజుకి భారీ డిస్కౌంట్లు

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ ఉన్న మారుతి సుజుకి కార్లలో ఆల్లో కె10 ఒకటి. ఈ కారు కొనుగోలుపై కస్టమర్లకు కంపెనీ రూ.62 వేల వరకు ప్రయోజనాలు అందిస్తోంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : April 6, 2024 / 04:32 PM IST

    Maruti Suzuki

    Follow us on

    Maruti Suzuki: కొత్త ఏడాది 2024 ప్రారంభమై మూడు నెలలు గడిచింది. నాలుగో నెల(ఏప్రిల్‌) కూడా వచ్చేసింది. ఈ తరుణంలో ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి కొన్ని మోడల్స్‌ కార్లపై భారీ డిస్కౌంట్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఆల్టో కే10, ఎస్‌ ప్రెస్సో, వ్యాగన్‌ ఆర్, సెలెరియో, స్విఫ్ట్, డిజైర్, ఈకో కార్లపై అద్భుతమైన తగ్గింపులను అందిస్తోంది. కంపెనీ ఈ కార్ల కొనుగోలు మీద క్యాష్‌ డిస్కౌంట్, ఎక్సే్చంజ్‌ బోనస్, ఇతర ప్రయోజనాలను అందిస్తోంది. ఈ డిస్కౌంట్స్‌ లేదా బెనిఫిట్స్‌ కేవలం ఏప్రిల్‌ నెలలో కొనేవారికి మాత్రమే వర్తిస్తాయని తెలుస్తోంది. వివిధ కార్లపై అందిస్తున్న ఆఫర్స్‌ తెలుసుకుందాం.

    మారుతి ఆల్టో కే10
    భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ ఉన్న మారుతి సుజుకి కార్లలో ఆల్లో కె10 ఒకటి. ఈ కారు కొనుగోలుపై కస్టమర్లకు కంపెనీ రూ.62 వేల వరకు ప్రయోజనాలు అందిస్తోంది. మాన్యువల్‌ వేరియంట్‌పై రూ.57 వేల వరకు, సీఎన్‌జీ వేరియంట్‌పై రూ.42 వేల వరకు తగ్గింపు ఇస్తుంది. రూ.3.99 లక్షల నుంచి రూ.5.96 లక్షల మధ్య లభించే ఈ కారు 1.0–లీటర్‌ త్రీ సిలిండర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ పొందుతుంది.

    మారుతి ఎస్‌–ప్రెస్సో
    మారుతి ఆల్టో కే10 మాదిరిగానే అదే 1.0 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ కలిగిన ఎస్‌–ప్రెస్సో రెనాల్ట్‌ క్విడ్‌ కారుకు ప్రత్యర్థిగా ఉంది. కంపెనీ ఇప్పుడు ఎస్‌–ప్రెస్సో ఆటోమాటిక్‌ వేరియంట్‌ కొనుగోలుపై రూ.61 వేలు, మాన్యువల్‌ వేరియంట్‌పై రూ.56 వేల తగ్గింపు ఇస్తుంది. ఇక సీఎన్‌జీ వేరియంట్‌ కొనుగోలుపైన కస్టమర్‌ రూ.46 వేల తగ్గింపు పొందవచ్చు. ఎస్‌–ప్రెస్సో ధరలు రూ.4.27 లక్షల నుంచి రూ. 6.12 లక్షల మధ్య ఉన్నాయి.

    మారుతి సెలెరియో
    మారుతి సెలెరియో కొనుగోలుపై కూడా భారీగా డిస్కౌంట్‌ ప్రకటించింది. మాన్యువల్‌ వేరియంట్‌పై రూ.56 వేలు, ఆటోమాటిక్‌ వెర్షన్‌పై రూ.61 వేలు, సీఎన్‌జీ వేరియంట్‌పై రూ.46 వేల వరకు కస్టమర్లక తగ్గింపు ఇస్తుంది. దీని ధర రూ. 3.37 లక్షల నుంచి రూ. 7.10 లక్షల మధ్య ఉంది. ఈ కారు 1.0 లీటర్‌ త్రీ సిలిండర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ పొందుతుంది. ఇది 67 హార్స్‌ పవర్‌ ప్రొడ్యూస్‌ చేస్తుంది.

    మారుతి వ్యాగన్‌ ఆర్‌
    వ్యాగన్‌ ఆర్‌ కొనుగోలుపైన మారుతి సుజుకి రూ.61 వేల(ఆటోమాటిక్‌ వేరియంట్‌) తగ్గింపును అందిస్తోంది. మాన్యువల్‌ వేరియంట్‌పై రూ.56 వేలు పొందవచ్చు. సీఎన్‌జీ వేరియంట్‌పై రూ.36 వేల వరకు డిస్కౌంట్‌ ఇస్తుంది. దీని ధర రూ.5.55 లక్షల నుంచి రూ.7.26 లక్షల మధ్య ఉంది. ఈ కారు 1.0–లీటర్‌ త్రీ సిలిండర్‌ పెట్రోల్‌ ఇంజిన్, 1.2–లీటర్‌ ఫోర్‌ సిలిండర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ ఆప్షన్‌తో లభిస్తుంది.

    మారుతి స్విఫ్ట్‌
    మారుతి సుజుకి అనగానే అందరికీ గుర్తొచ్చే కారు స్విఫ్ట్‌. ఇప్పుడు కంపెనీ ఈ కారుపైన రూ.42 వేల డిస్కౌంట్స్‌ అందిస్తోంది. ఈ తగ్గింపు స్విఫ్ట్‌ ఆటోమాటిక్‌ వేరియంట్‌ కొనుగోలుపై లభిస్తుంది. ఇక మాన్యువల్‌ వేరియంట్‌ కొనుగోలుపైన రూ.37 వేల డిస్కౌంట్, సీఎన్‌జీ వేరియంట్‌పై రూ.22 వేల తగ్గింపు లభిస్తుంది. స్వి్వఫ్ట్‌ ధరలు మార్కెట్లో రూ. 5.99 లక్షల నుంచి రూ. 8.89 లక్షల మధ్య ఉన్నాయి.

    మారుతి డిజైర్‌
    టాటా టిగోర్, హ్యుందాయ్‌ ఆరా వంటి వాటికి ప్రత్యర్థిగా ఉన్న మారుతి డిజైర్‌ కొనుగోలుపైనా కంపెనీ అద్భుతమైన తగ్గింపులను అందిస్తోంది. డిజైర్‌ ఆటోమాటిక్‌ వేరియంట్‌ కొనుగోలుపైన రూ. 37 వేలు, మాన్యువల్‌ వేరియంట్‌ కొనుగోలుపైన రూ.32 వేలు, సీఎన్‌జీ వేరియంట్‌పై రూ.7 వేల వరకు లభిస్తుంది. డిజైర్‌ ధరలు రూ. 6.57 లక్షల నుంచి రూ. 9.39 లక్షల మధ్య ఉన్నాయి.

    మారుతి ఈకో
    మారుతి ఈకో కొనుగోలుపైన కూడా కస్టమర్లు భారీగా తగ్గింపు పొందవచ్చు. పెట్రోల్‌ వేరియంట్‌ మీద రూ.29 వేలు ప్రయోజనాలు లభిస్తాయి. సీఎన్‌జీ వర్షన్‌పై రూ.24 వేల డిస్కౌంట్‌ లభిస్తుంది. ఈకో ధరలు ప్రస్తుతం రూ.5.32 లక్షల నుంచి రూ.6.28 లక్షల మధ్య ఉన్నాయి. డిస్కౌంట్స్‌ కేవలం ఈ నెలకు మాత్రమే పరిమితం.