
ప్రజల ఆదరణ చూశాక హైదరాబాద్ మేయర్ పీఠం బీజేపీకే దక్కే అవకాశాలున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఆదివారం హైదరాబాద కు వచ్చిన అమిత్ షా ముందుగా చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి టెంపుల్ లో పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో చెరువులు, నాళాలపై అక్రమ కట్టడాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే వాటిని కూల్చేస్తుందన్నారు. బీజేపీకి అవకాశం ఇస్తే ఐటీ పరంగా కూడా అభివ్రుద్ధి చేస్తామన్నారు. తాము హామీలు ఇస్తున్నామంటే అవి కచ్చితంగా చేసే తీరుతామని అమిత్ షా స్పష్టం చేశారు.