Top Selling Cars: కాలం మారుతున్న కొద్దీ కార్ల వినియోగం పెరిగిపోతుంది. దీంతో దేశీయంగా అమ్మకాలు జోరందుకుంటున్నాయి. కరోనా తరువాత ప్రతి ఒక్కరూ సొంత వెహికల్ ఉండాలనుకుంటున్నారు. ఇందులో భాగంగా కారు కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. వినియోగదారుల డిమాండ్ కు అనుగుణంగా కార్ల కంపెనీలు ఉత్పత్తుల జోరు పెంచాయి. వాటికి అనుకుగుణంగా విక్రయాలు జరిపాయి. గత ఏడాది కార్ల అమ్మకాలు విపరీతంగా సాగినట్లు కొన్ని లెక్కలను భట్టి తెలుస్తోంది. ముఖ్యంగా 2023 డిసెంబర్ నెలలో జరిగిన కార్ల విక్రయాల డేటాను ఒక్కో సంస్ఠ బయటపెట్టింది. వాటి వివరాల్లోకి వెళితే..
దేశంలో అగ్రగామిగా నిలుస్తోన్న మారుతి సుజుకీ కంపెనీ డిసెంబర్ నెలలో విక్రయాలు బాగానే జరిపినట్లు తెలుస్తోంది. ఈనెల మొత్తం 1.06 లక్షల యూనిట్లను విక్రయించినట్లు తెలిపింది. ఈ ఏడాది మొత్తంలో 20 లక్షలకు పైగా విక్రయించినట్లు సమాచారం. వీటిలో గ్రాండ్ విటారా, బ్రెజా వంటి కార్లు అత్యధికంగా సేల్స్ జరిగాయి. వాహనాల ఉత్పత్తుల్లో పోటీ పడుతున్న కంపెనీల్లో టాటా మోటార్స్ ఒకటి. ఈ కంపెనీ డిసెంబర్ నెల మొత్తంలో 43,675 యూనిట్లు విక్రయాలు జరుపుకుంది. 2022 డిసెంబర్ తో పోల్చుకుంటే ఇది 8 శాతం ఎక్కువ. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన ఈవీలు సైతం 5,006 విక్రయించింది.
దక్షిణ కొరియా కంపెనీ హ్యుందాయ్ అమ్మకాల జోరు పెంచినట్లు కనిపిస్తోంది. ఈ కంపెనీ డిసెంబర్ లో 42,750 యూనిట్లను విక్రయించింది. ఏడాది వ్యాప్తంగా హ్యుందాయ్ 6.02 లక్షల యూనిట్లను విక్రయించింది. వీటిలో హ్యుందాయ్ క్రెటా అన్నింటికంటే ఎక్కువగా అమ్మకాలు జరుపుకుంది. 2022 డిసెంబర్ తో పోల్చుకుంటే ఇది 19 శాతం ఎక్కువ.
భారత్ లో అత్యధిక విక్రయాలు చేస్తున్న కంపెనీల్లో ఎంజీ మోటార్స్ ఒకటి. ఈ కంపెనీ డిసెంబర్ నెలలో 4,400 యూనిట్లను విక్రయించింది. డిసెంబర్ 2022 తో పోల్చుకుంటే 13 శాతం ఎక్కువ. అయితే ఏడాదిగా ఈ కంపెనీ 56,902 యూనిట్లు విక్రయించింది. 2022 ఇయర్ తో పోల్చకుంటే ఇది 18 శాతం ఎక్కువ. మొత్తంగా ఈ కంపెనీలు డిసెంబర్ నెలలో అత్యధిక విక్రయాలు జరుపుకున్న వాటిలో ఉన్నాయి.