Senior Citizens Best Cars: జీవితాంతం కష్టపడిన తరువాత చివరి మజిలీలో సంతోషంగా ఉండాలని చాలామంది అనుకుంటారు. దీంతో ఉద్యోగం చేసే సమయంలోనే కొందరు ఫ్యూచర్ ప్లాన్లు వేసి డబ్బును కూడబెట్టుకుంటారు. వీరిలో కొందరు ఇల్లు కట్టుకొని, తమ అవసరాలను తీర్చే వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలు చేసి రిటైర్ అయన వారు ప్రయాణాలు చేయడానికి ఏదైనా వాహనం కొనుగోలు చేయాలని భావిస్తారు.
ఈ తరుణంలో కారును కొనాలనుకునేవారికి ఎటువంటి మోడల్ అయితే బెస్ట్ ఆప్షన్ అనే అయోమయం ఉంటుంది. ఇప్పుడు వస్తున్న కార్లలో చాలా వరకు ఎస్ యూవీ లే ఉన్నాయి. ఇవి కొంచెం అప్డేట్ ఫీచర్స్ తో సీనియర్ సిటిజన్స్ కు అనుకూలంగా ఉండవు. అయితే కొన్ని కంపెనీలు మాత్రం పెద్దవారిని దృష్టిలో ఉంచుకొని రెండు మోడళ్లను తయారు చేశారు. మరి ఆ కార్లేవో తెలుసుకుందామా..
మారుతి సుజుకి నుంచి డిఫరెంట్ మోడల్స్ మార్కెట్లో ఆకట్టుకుంటున్నాయి. యూత్ తో పాటు సినీయర్ సిటీజన్స్ కు అనువైన ఉత్పత్తులు చేస్తున్నాయి. మారుతి సుజుకి నుంచి వ్యాగన్ ఆర్ సీనియర్ సిటీజన్స్ కు బాగా కంపోర్ట్ గా ఉంటుంది. 998 సీసి ఇంజన్ తో పాటు 55.92 బీమెచ్ పీ పవర్ తో కలిగి ఉంటుంది. పెట్రోల్ తో పాటు సీఎన్ జి ఫ్యూయల్ కలిగిన ఈ మోడల్ లీటర్ కు రూ.23 నుంచి 25 కిలోమీటర్ల మైలేజి ఇస్తుంది. దీని ధర రూ.5 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. తక్కువ బడ్జెట్ లో సీనియర్ సిటిజన్స్ కు అనువైన కారు ఇదేనని కొందరు అభిప్రాయపడుతున్నారు.
టాటా నుంచి టియాగో మోడల్ సైతం పెద్దవారిని ఆకర్షిస్తుంది. 1199 సీసీ ఇంిజన్ తో పాటు 72.0 బీహెచ్ పీ పవర్ కలిగిని ఈ మోడల్ లీటర్ కు 19 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. పెట్రోల్ తో పాటు సీఎన్ జి ఫ్యూయల్ కలిగిన ఈ కారు రూ.5.60 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. వ్యాగన్ ఆర్ తో పోలిస్తే ఈ కారు మైలేజీ తక్కువగానే ఉంటుంది. కానీ ఇంజిన్ సీసీ లో తేడా ఉంటుంది. అయితే ధర మాత్రం వ్యాగన్ ఆర్ తో పోటీ పడుతుంది. ఈ రెండు మోడళ్ల పెద్దవారికి అనుకూలంగా ఉంటాయని ఆటోమోబైల్ రంగ నిపుణులు తెలుపుతున్నారు. తక్కవ బడ్జెట్ పెట్టి సుదూరం కాకుండా వ్యక్తిగతంగా ప్రయాణం చేయాలనుకునే వారు ఈ మోడళ్ల వైపు వెళ్లొచ్చు.