https://oktelugu.com/

Budget Cars: రూ.6 లక్షల బడ్జెట్‌లో బెస్ట్‌ 5 కార్లు ఇవే..!

పాపులర్ కార్లలో మారుతి సుజుకి స్విఫ్ట్ ఒకటి. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.5.99 లక్షల నుంచి రూ.9.03 లక్షలు(ఎక్స్-షోరూం) ఉంటుంది. ఈ కారులో 1.2 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ ఉంటుంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : April 16, 2024 / 11:15 AM IST

    Budget Cars

    Follow us on

    Budget Cars: కార్ల అమ్మకాల్లో ప్రపంచంలో మన దేశం మూడో స్థానంలో ఉంది. అమెరికా, చైనా తర్వాత ఎక్కువగా కార్లు అమ్ముడయ్యేది ఇండియాలోనే. ఇక భారత కార్‌ మార్కెట్‌లో ఎస్‌యూవీ, హ్యాచ్‌బ్యాక్స్‌ నుంచి ఎంవీపీల వరకు అన్నిరకాల కార్లు లభిస్తాయి. అంతేకాదు టాప్ ఎండ్ ప్రీమియం కార్ల నుంచి అఫర్డబుల్ కార్ల వరకు అన్ని రకాలు ఇక్కడ దొరుకుతాయి. రూ.6 లక్షల బడ్జెట్లో లభించే మోస్ట్ అఫర్డబుల్ కార్ల గురించి తెలుసుకుందాం.

    1. రెనాల్ట్‌ ట్రైబర్‌
    ఈ కారు ధర సుమారుగా రూ.6 లక్షల నుంచి రూ.8.97 లక్షలు(ఎక్స్-షోరూం)గా ఉంది. ఈ కారులో 1 లీటర్, త్రీ-సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 72 bhp పవర్, 96 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. రెనాల్ట్‌ ట్రైబర్ కారులో డ్రైవర్ సీట్ ఆర్మ్స్ పవర్డ్ వింగ్ మిర్రర్స్, ఏడు ఆంగుళాల టీఎఫీ ఇన్‌స్ట్రుమెంట్‌ కన్సోల్, వైర్‌లెస్‌ స్మార్ట్‌ఫోన్‌ ఛార్జర్ లాంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. రెనో అప్డేటెడ్ ట్రైబర్ RXL వేరియంట్లో రియర్ వైపర్, రివర్స్ పార్కింగ్ కెమెరా, రియర్ ఎయిర్ కండిషనింగ్ వెంట్స్, పీఎమ్ 2.5 ఎయిర్ ఫిల్టర్‌ అమర్చారు. ఈ ట్రైబర్ కారు, రెనాల్ట్‌కు సంబంధించి భారతదేశంలోనే బెస్ట్ సెల్లర్‌గా ఉంది.

    2. మారుతి స్విఫ్ట్..
    పాపులర్ కార్లలో మారుతి సుజుకి స్విఫ్ట్ ఒకటి. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.5.99 లక్షల నుంచి రూ.9.03 లక్షలు(ఎక్స్-షోరూం) ఉంటుంది. ఈ కారులో 1.2 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 90 bhp పవర్, 113 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్, CVT ఆటోమేటిక్ గేర్‌బాక్‌‍్స ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్‌లో వస్తుంది. భద్రతా పరంగా చూసుకుంటే, ఈ స్విఫ్ట్ కారులో ADAS – అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా వంటి అధునాతన ఫీచర్లను ఉన్నాయి.

    3. హ్యుందాయ్‌ గ్రాండ్‌ ఐ10 నియోస్‌
    ఈ గ్రాండ్ ఐ10 నియోస్ ధర రూ.5.92 లక్షల నుంచి రూ.8.56 లక్షలు(ఎక్స్-షోరూం) ఉంటుంది. ఈ హ్యుందాయ్ కారులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అమర్చారు. ఇది 83 bhp పవర్, 114 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్, ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌(ఏఎమ్ఐ) ఆప్షన్లలో లభిస్తుంది. ఈ హ్యుందాయ్‌ గ్రాండ్‌ ఐ10 నియోస్‌లో 6.75 అంగుళాల టచ్‌ స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌, స్మార్ట్‌ఫోన్‌ మిర్రరింగ్‌ నేవిగేషన్‌, ఎస్ఈడీ టర్న్ ఇండికేటర్‌తో కూడిన ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ మిర్రర్, బ్లాక్-పెయింటెడ్ మిర్రర్లు, 15-అంగుళాల గన్మెటల్ స్టైల్ వీల్స్, గ్లోసీ బ్లాక్ రేడియేటర్ గ్రిల్, రెడ్‌ కలర్‌ ఇన్సర్టులు(సీట్లు, ఏసీవెంట్‌‍్స, గేర్‌బూట్‌) ఉన్నాయి.

    4. నిస్సాన్‌ మాగ్నైట్‌..
    ఈ కారు ధర రూ.6 లక్షల నుంచి రూ.11.27 లక్షలు (ఎక్స్-షోరూం)వరకు ఉంటుంది. ఇది రెండు ఇంజిన్ ఆప్షన్లతో వస్తుంది. 1-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 72 bhp పవర్, 96 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. 1 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌, 100 bhp పవర్, 160 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఆటోమేటిక్, మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్‌తో వస్తుంది. ఈ కారు లీటర్‌కు 17.4 కి.మీ – 20 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఈ కారు 32 వేరియంట్లలో, 9 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

    5. వ్యాగన్‌ ఆర్‌..
    ఈ కారుధర రూ.5.54 లక్షల నుంచి రూ.7.38 లక్షలు(ఎక్స్‌షోరూం) వరకు ఉంది. ఈ హ్యాచ్‌బ్యాక్ కారు కూడా రెండు ఇంజిన్ ఆప్షన్లతో వస్తుంది. 1 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ 67 bhp పవర్, 89 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 90bhp పవర్, 113 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజిన్లు కూడా 5 స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ అనుసంధానంతో పనిచేస్తాయి. ఈ మారుతి సుజుకి వ్యాగనార్ కారులో 7 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్‌ఫంటైన్ మెంట్ డిస్‌ప్లే, స్మార్ట్‌ఫోన్‌ కనెక్టివిటీ, రిమోట్ కీలెస్ ఎంట్రీ, పవర్డ్ విండోస్, రియర్ పార్కింగ్ సెన్సార్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ, హైస్పీడ్ అలర్ట్ సిస్టమ్ ఉన్నాయి.