Devara Movie: ఆ విషయంలో దేవర సినిమాకి కష్టాలు తప్పడం లేదా..?

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఎక్స్పెక్టేషన్స్ అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇక దానికి తోడుగా రీసెంట్ గా ఎన్టీఆర్ దేవర గురించి మాట్లాడిన మాటలు సినిమా మీద అంచనాలను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయనే చెప్పాలి.

Written By: Gopi, Updated On : April 16, 2024 10:59 am

Devara movie will face difficulties

Follow us on

Devara Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ గురించి మనం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వాళ్ల తాత అయిన శ్రీ “నందమూరి తారక రామారావు”గారి అంశతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ తనదైన రీతిలో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇక ఇప్పుడు పాన్ ఇండియాలో ఆయన చేసిన ‘దేవర ‘ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి.

ఇక ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఎక్స్పెక్టేషన్స్ అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇక దానికి తోడుగా రీసెంట్ గా ఎన్టీఆర్ దేవర గురించి మాట్లాడిన మాటలు సినిమా మీద అంచనాలను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయనే చెప్పాలి. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ఏంటి అంటే దేవర సినిమా తెలుగు లో డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కొనడం కోసం భారీ మొత్తంలో పెట్టడానికి ఏ డిస్ట్రిబ్యూటర్ ముందుకు రావడంలేదనే వార్తలైతే వస్తున్నాయి.

ఇక తెలుగులో దేవర రైట్స్ కోసం 120 కోట్ల రూపాయలని ప్రొడ్యూసర్స్ డిమాండ్ చేస్తుండగా, అంత మొత్తంలో డిస్ట్రిబ్యూటర్లు పెట్టాలా, వద్దా అనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే పర్లేదు, ఒకవేళ నెగటివ్ టాక్ వచ్చిందంటే డిస్ట్రిబ్యూటర్ కి దారుణమైన లాసులైతే వస్తాయి. దానివల్లే డిస్ట్రిబ్యూటర్లు ఆచి తూచి వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఎన్టీఆర్ ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీగా అంచనాలైతే పెంచుతున్నాడు.

ఇక డిస్ట్రిబ్యూటర్లు దేవర రైట్స్ ని దక్కించుకోవడానికి అంత మొత్తాన్ని చెల్లిస్తారా లేదంటే ఈ సినిమా ప్రొడ్యూసర్స్ కొద్ది మొత్తంలో తగ్గించుకుంటారా అనే విషయాల్లో క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం కొరటాల శివ కి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు మంచి ఫ్రెండ్స్ కావడం వల్ల వాళ్లతోనే ఈ రైట్స్ ని కొనుగోలు చేయించేలా ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక చూడాలి మరి దేవర సినిమా ఎంతకీ అమ్ముడు పోతుంది, ఫైనల్ గా ఎన్ని కోట్లు వసూలు చేస్తుంది అనేది…