Best Budget Car 2025 : కొంత మందికి కారు కొనుగోలు చేయాలని ఉంటుంది. కానీ ధర విషయంలో వెనుకడుగు వేస్తారు. అయితే ఒక్కోసారి కారు బాగా నచ్చడంతో పెట్టిన ధర తక్కువే అనుకుంటాం. ఎందుకంటే మార్కెట్లోకి మంచి ఫీచర్స్ఉండే కార్లు తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. కంపెనీల మధ్య పోటీ ఏర్పడడంతో పాటు వినియోగదారుల నుంచి డిమాండ్ ఉండడంతో చాలా వరకు పెద్ద కార్లు సైతం తక్కువ ధరకే అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లోకి Mahindra కంపెనీకి చెందిన ఓ కారు తక్కువ ధరకే మంచి ఫీచర్స్ అందించేందుకు రెడీ అయింది. ఇంతకీ ఆ కారు ఏదో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వివరాల్లోకి వెళ్లండి..
Also Read: ఈ కారు కొన్నారంటే ఎక్కేదాకా విడిచిపెట్టరు. ఇందులో అంత స్పెషల్ ఏముందంటే?
నాణ్యమైన కార్లను మార్కెట్లోకి తీసుకురావడంలో మహీంద్రా కంపెనీ ముందు ఉంటుంది. ఈ క్రమంలో ధర విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాదు. అయితే ధర ఎక్కువైనా మహీంద్రా కార్లను ఎగబడి కొంటారు. అందుకు ఉదాహరణే థార్ కారు. ఈ కారు 2024 మోడల్ మార్కెట్లోకి వచ్చిన వెంటనే లక్షల కొద్దీ విక్రయాలు జరిగాయి. అయితే ఇప్పుడు ఈ కంపెనీ మార్కెట్లోకి కొత్తగా ఓ కారును తీసుకొచ్చింది. అదే XUV 3X0 “REVX”.ఇప్పటికే మార్కెట్లో XUV 3X0 వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే దీనికి కొనసాగింపుగా REVXసిరీస్ తో మార్కెట్లోకి వచ్చింది.
ఇది మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటిలో ప్రధానంగా 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ను అమర్చారు. ఈ ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వద్ద పనిచేస్తుంది. అలాగే ఈ ఇంజిన్ 130 బీహెచ్ పీ పవర్ తో పాటు 230 ఎన్ ఎం టార్క్ ను రిలీజ్ చేస్తుంది. ఈ ఇంజిన్ తో కారు నడిపేవారు కొత్త అనుభూతిని పొందుతారు. హైవేలో వెళ్లేవారికి స్వర్గంలా కనిపిస్తుంది.
మహీంద్రా XUV 3X0 “REVX” రూ.8.94 లక్షల ధరతో ప్రారంభం అవుతుంది. ఇందులో ఉన్న టాప్ వేరియంట్ రూ.12.99 లక్షల వరకు విక్రయించనున్నారు. అయితే ఇందులో ఉన్న REVX M(O) ను రూ.9.44 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. ఇది బేస్ మోడల్ కంటే ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో ప్రధానంగా సన్ రూఫ్ ఆకర్షణీయంగా ఉండనుంది. అలాగే లేటేస్ట్ టెక్నాలజీతో కూడిన ఇంటీరియర్ ఫీచర్లు ఉన్నాయి. డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్ తో పాటు ఆడియో కనెక్టివిటీ ఆకట్టుకుంటుంది.
Also Read: రూ.2 లక్షలకే వ్యాగన్ఆర్.. వెంటనే త్వరపడండి
గతంలో మహీంద్రా కార్లు అంటే రూ.10 లక్షలకు తక్కువగా ఉండేవి కావు. కానీ ప్రీమియం లుక్ లో ఇచ్చే ఈ కారు రూ. 8 లక్షలకే అందుబాటులో ఉండడంతో మహీంద్రా లవర్స్ దీనిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఆయా ప్రాంతాల్లో షోరూంల్లో ధరలల్లో వ్యత్యాసాలు ఉంటాయి.