Class 10 man millionaire journey: కొన్ని కథలు గొప్పగా ఉంటాయి. కొంతమంది జీవితాలు ఉన్నతంగా అనిపిస్తుంటాయి. వారు వేసిన అడుగులు.. నడిచిన విధానం.. సాగించిన ప్రయాణం.. వ్యవహరించిన విధానం అన్ని విభిన్నంగా ఉంటాయి. అటువంటి వారి గురించి చెప్పుకోవాలి. అటువంటి వారి గురించి చర్చించుకోవాలి. అవసరమైతే మనము కూడా వారిలాగా ఉండాలి. ఉండడం మాత్రమే కాదు చివరి వరకు అదే విధానాన్ని కొనసాగించాలి.
నేటి కాలంలో డబ్బుతోనే పని. డబ్బు ఉంటేనే పని. డబ్బు లేకుంటే ఇంట్లో వాళ్ళు కూడా లెక్క చేయలేని పరిస్థితి. డబ్బులు వెనుక చేయాలంటే కష్టపడాలి. రూపాయి రూపాయి కూడపెట్టాలి. అయితే అలా సంపాదించిన డబ్బును పొదుపుగా వాడుకుంటే గొప్ప జీవితాన్ని ఆస్వాదించవచ్చు. కోటీశ్వరులుగా ఎదగవచ్చు. అలాంటిదే ఇతడి జీవితం కూడా. తన జీవన ప్రయాణాన్ని.. తాను పాటించిన ఆర్థిక క్రమశిక్షణ గురించి ఈ వ్యక్తి సామాజిక మాధ్యమాలలో పంచుకున్నాడు. అంతేకాదు దీనికోసం తాను అవలంబించిన విధానాలను వెల్లడించాడు. తద్వారా తాను ఆర్థికంగా ఎలా ఎదిగాడో పూసగుచ్చినట్టు చెప్పాడు.
ఆ వ్యక్తి రెడిట్ లో తన ఆర్థిక విజయ గాథను పంచుకున్నాడు. ఆ వ్యక్తికి 53 సంవత్సరాలు. అతను చదువుకుంది కేవలం 10 వరకు మాత్రమే. ఒక చిన్న ఉద్యోగం చేయడం మొదలుపెట్టాడు. అప్పట్లో అతడివేతనం 4200 ఉండేది. అతడు వచ్చిన వేతనాన్ని కొంత వరకు మాత్రమే ఖర్చు పెట్టుకుని.. మిగతాది మొత్తం పొదుపు చేయడం మొదలుపెట్టాడు. అలా గడిచిన 25 సంవత్సరాలలో అతడు ఏకంగా కోటి రూపాయల వరకు పొదుపు చేశాడు. స్వల్ప వేతనం మాత్రమేనని కృంగిపోలేదు. ఎవరి వద్ద కూడా అప్పు చేయలేదు. క్రెడిట్ కార్డ్ వాడలేదు. ప్రతి ప్రయాణానికి ఆర్టీసీ బస్సులు మాత్రమే ఉపయోగించాడు. అవసరమైతే తప్ప రైలులో ప్రయాణించలేదు. ఇక అతను కార్యాలయానికి.. ఇంటికి నడుచుకుంటూనే వెళ్లేవాడు.
అందులో ఇన్వెస్ట్ చేస్తున్నాడు
కోటి రూపాయలకు మించి పొదుపుచేసిన తర్వాత.. ఇటీవల కాలంలో ఈక్విటీలలో పొదుపు చేస్తున్నాడు. అవి కూడా అతడికి మంచి లాభాలను ఇస్తున్నాయి. అయితే వాటి ద్వారా ఎంత వస్తుంది అనే విషయాన్ని మాత్రం అతడు చెప్పలేదు. “దుబారా ఖర్చులు పెట్టలేదు. అవసరమైతే తప్ప కొనుగోలు చేయలేదు. నాకంటూ ఎటువంటి వ్యసనాలు లేవు. నా జీవితంలో ఇంతవరకు అప్పు చేయలేదు. పిల్లలు.. వారి ఎదుగుదల విషయంలోనూ పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగాను. అందువల్లే ఆర్థిక స్థిరత్వాన్ని సాధించానని” ఆ వ్యక్తి చెప్పుకొచ్చాడు.