Operation Sindoor new video: మిసైల్స్ దూసుకుపోయాయి. లక్ష్యాలను చేదించాయి. చూస్తుండగానే సర్వనాశనం చేసి వచ్చాయి. వెనకటికి లంకను హనుమంతుడు దహనం చేసినట్టు.. భస్మీపటలం చేసి కోలుకోలేని దెబ్బతీసి వచ్చాయి. ఆ దృశ్యాలు చూస్తుంటే హాలీవుడ్ సినిమా కూడా దేనికీపనికిరాదు అన్నట్టుగా ఉంది. అద్భుతమైన మాట కూడా సరిపోదనిపిస్తోంది. అలా ఉంది మరి ఆ వీడియో.. అలాగని అది ఏ కృత్రిమ మేధ సహాయంతో రూపొందించింది కాదు. గ్రాఫిక్స్ వాడి తయారు చేసింది కాదు. అది మన శౌర్యం.. మన ధైర్యం.. మన స్థైర్యం.. మన శక్తి.. మన యుక్తి..
రోమాంచిత వీడియో
ఇండియన్ ఆర్మీ ఎంత శక్తివంతమైనదో.. ఎంతటి బలవంతమైనదో.. తిక్కరేగితే ఎంతటి నష్టం కలిగిస్తుందో ఆ వీడియోలో కనిపిస్తోంది. పెద్దగా యుద్ధ విమానాల సహాయం లేకుండానే.. శత్రుదేశంలో మన సైనికులు కాళ్లు మోపకుండానే పని జరిగిపోయింది. చూస్తుండగానే లక్ష్యాలను చేదించాయి. మంట పుట్టించి.. చివరికి బూడిద మిగిలించాయి. ప్రాణ నష్టం.. ఆస్తి నష్టం.. ఇవన్నీ క్షణాలలోనే జరిగిపోయాయి. ఈ వీడియో సగటు భారతీయుడికి రోమాంచితంగా ఉంది. అయితే ఈ ఆపరేషన్ ఇండియన్ ఆర్మీ ఇప్పుడెందుకు విడుదల చేసింది అంటే దానికి ఒక కారణం ఉంది.
బూడిద మిగిలింది
ఇటీవల పహల్గాం దాడిలో అమాయకులైన భారతీయ పౌరులు కన్నుమూసిన సంగతి తెలిసిందే. దీని అంతటికి దాయాది ప్రేరేపిత ఉగ్రవాదులే కారణం. ఈ ఘటన తర్వాత భారత ఆర్మీ ఉడికిపోయింది. కోపంతో రగిలిపోయింది. పైనుంచి ఆదేశాలు రావడమే ఆలస్యం రెచ్చిపోయింది. ఏ ఉగ్రవాదులు అయితే మనదేశంలో నెత్తుటి క్రీడకు పాల్పడ్డారో.. వారికి అంతకుమించి అనేలాగా సినిమా చూపించింది. వారి స్థావరాలను.. వారి మూలాలను తీవ్రంగా దెబ్బ కొట్టింది. అలాగని వారి దేశంలోకి వెళ్ళలేదు. మన భూభాగం నుంచి సూపర్ దాడులు చేసింది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపు విధ్వంసాన్ని సృష్టించింది. తద్వారా తమ సైనిక శక్తి ప్రపంచ దేశాలకు మించిందని నిరూపించింది భారత ఆర్మీ. ప్రస్తుతం చైనా తన ఆయుధ సంపత్తిని ప్రపంచ దేశాల ముందు గొప్పగా చెప్పుకుంటున్న క్రమంలో.. తమ తక్కువ ఏం కాదని.. తమదైన రోజు దుమ్ము రేపుతామని భారత ఆర్మీ ఆ వీడియోలో స్పష్టం చేసింది. ఆ వీడియోలో మిస్సయిల్స్ ఎలా దూసుకుపోయాయి.. ఉగ్రవాదుల శిబిరాలను ఎలా నేలకూల్చాయి.. ఏ రూపంలో తాము ఈ ఆపరేషన్ సిందూర్ నిర్వహించామనే విషయాలను భారత ఆర్మీ వీడియో రూపంలో ప్రదర్శించింది. ఈ వీడియో మనకు రోమాంచితంగా ఉంటే.. శత్రు దేశాలకు.. ప్రత్యర్థి దేశాలకు వణుకు పుట్టిస్తున్నాయి. ఇండియన్ ఆర్మీ తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో వాస్తవంలో చూపిస్తున్నాయి. దటీజ్ ఇండియన్ ఆర్మీ.. జై భారత్..
#NorthernCommand ‘s resolute operations in #OperationSindoor were an exemplar of restraint turning into decisive response. Precision strikes on terror launchpads and the elimination of perpetrators of the #Pahalgam massacre underscore our unwavering pursuit of peace in the… pic.twitter.com/PeUIahQKF6
— NORTHERN COMMAND – INDIAN ARMY (@NorthernComd_IA) September 3, 2025