Homeక్రీడలుక్రికెట్‌Virat Kohli : అందుకే అతనికి ఎక్కువగా స్నేహితులు ఉండరు.. విరాట్ కోహ్లీపై.. మాజీ క్రికెటర్...

Virat Kohli : అందుకే అతనికి ఎక్కువగా స్నేహితులు ఉండరు.. విరాట్ కోహ్లీపై.. మాజీ క్రికెటర్ సంచలన ఆరోపణలు..

Virat Kohli : విరాట్ కోహ్లీ.. సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న భారతీయ క్రీడాకారుడిగా కొనసాగుతున్నాడు. బయట కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న ఆటగాడిగా ఉన్నాడు. దూకుడు స్వభావానికి, దుందుడుకు వ్యక్తిత్వానికి విరాట్ కోహ్లీ సిసలైన చిరునామాగా కొనసాగుతున్నాడు. ఆటగాడిగా, కెప్టెన్ గా ఇలా ఎన్ని పాత్రలు పోషించినప్పటికీ.. విరాట్ తన వ్యక్తిత్వాన్ని మార్చుకోలేదు. తన సహజ లక్షణాన్ని వదులుకోలేదు. అదే ఆయన పాలిట శాపమైందని చెబుతున్నాడు ఓ మాజీ క్రికెటర్. అంతేకాదు అతనిపై సంచలన ఆరోపణలు కూడా చేశాడు. ఇంతకీ ఎవరు ఆ క్రికెటర్.. విరాట్ కోహ్లీపై ఎందుకు ఆరోపణలు చేశాడు? దీనిపై ప్రత్యేక కథనం..

యూట్యూబర్ ఇంటర్వ్యూలో..

టీమిండియాలో అమిత్ మిశ్రా ఒకప్పుడు కీలక స్పిన్నర్ గా ఉండేవాడు. పలు మ్యాచ్ లలో భారత జట్టును గెలిపించాడు. టీమిండియా కు గుడ్ బై చెప్పిన తర్వాత.. అప్పట్లో ఐపీఎల్ లో ఆడాడు. ఆ తర్వాత కామెంట్రీ చేశాడు. అయితే ప్రస్తుతం ఓ యూట్యూబర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించాడు. ముఖ్యంగా విరాట్ కోహ్లీతో, రోహిత్ శర్మతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. ఈ సమయంలో విరాట్, రోహిత్ శర్మ లో ఎవరు ఉత్తమం, ఎవరికి స్నేహితులు ఎక్కువ అనే ప్రశ్నలకు మిశ్రా తనదైన శైలిలో సమాధానం చెప్పాడు.

అబద్ధం చెప్పను

“మీరు అడిగిన ప్రశ్నకు నేను అబద్ధం చెప్పలేను. విరాట్ కోహ్లీని ఒక క్రికెటర్ గా నేను విపరీతంగా ఆరాధిస్తాను. అతడి ఆటతీరును గౌరవిస్తాను. కానీ కెప్టెన్ అయిన తర్వాత విరాట్ కోహ్లీ పూర్తిగా మారిపోయాడు. అందుకే అతడికి టీమిండియాలో స్నేహితులు తక్కువ సంఖ్యలో ఉంటారు. అందువల్లే నేను కోహ్లీతో గతంలో ఉన్నట్టు ఉండలేకపోయాను. దాదాపు అతనితో మాట్లాడటం పూర్తిగా మానేశాను. పేరు, ప్రఖ్యాతలు, డబ్బు వస్తే చాలు కొంతమంది మారిపోతారు. ఎవరైనా వారి వద్దకు వస్తే ఏదో ఆశిస్తున్నారని భ్రమపడతారు. కానీ నా వ్యక్తిత్వం అలాంటిది కాదు. రోహిత్ శర్మకు, విరాట్ కోహ్లీకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇద్దరి సభావాలు కూడా వేరే విధంగా ఉంటాయి. నేను టీమ్ ఇండియాను వదిలిపెట్టి చాలా రోజులైంది. అయినప్పటికీ నేను కెరియర్ మొదలు పెట్టిన రోజుల్లో రోహిత్ నాతో బాగున్నాడు. ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు. అతనిలో ఏమాత్రం అసూయ, గర్వం కనిపించడం లేదు. భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్నప్పటికీ.. అతడు నాతోని ఇప్పటికీ సరదాగానే ఉంటాడు. కలిసినప్పుడు జోక్ లు వేస్తూ నవ్విస్తుంటాడు. అతడు ప్రపంచంలోనే అత్యుత్తమ కెప్టెన్. ప్రపంచ కప్ సాధించిన నాయకుడు. ఐదు ఐపీఎల్ టైటిల్స్ ముంబై జట్టుకు అందించిన సారధి” అని మిశ్రా పేర్కొన్నాడు.

Bhaskar
Bhaskarhttps://oktelugu.com/
Bhaskar Katiki is the main admin of the website
Exit mobile version