Bank FD Rates: చాలా మంది డబ్బులు దాచుకోవాలి అనుకుంటారు. కానీ పాటించడం మాత్రం చాలా కష్టం అని చెప్పాలి. అందుకే చిట్టీలు వేయడం, ఎల్ఐసీలు కట్టడం వంటివి చేస్తుంటారు. ఇక బ్యాంకులో డబ్బులు దాచుకోవడం చాలా ఉత్తమం. కానీ వడ్డీ రేటు చాలా తక్కువగా ఉంటుంది. అలాగే స్కీమ్స్ కూడా ఉత్తమంగా ఉండవని భావిస్తారు. అలాంటి వారికి బ్యాంక్ ఆఫ్ బరోడా గుడ్ న్యూస్ అందించింది. ఈ గుడ్ న్యూస్ వల్ల కస్టమర్లకు ఫుల్ గా బెనిఫిట్స్ కలుగుతాయనే చెప్పాలి. బ్యాంక్ ఆఫ్ బరోడా చేసిన ఈ ప్రకటన వల్ల డబ్బులు దాచుకోవాలనుకునే వారికి మంచి పథకం దొరికినట్టే..
అధిక వడ్డీ రేటు, స్వల్ప కాలిక టెన్యూర్ లోని ఫిక్స్ డిపాజిట్ స్కీమ్ ఇది. ఈ స్కీమ్ ద్వారా కస్టమర్లు రూ. 2 కోట్ల వరకు డబ్బులు దాచుకోవచ్చు. ఇక ఈ స్కీమ్ జనవరి 15 నుంచి అందుబాటులోకి వచ్చింది. అంటే నిన్నటి నుంచే అందుబాటులోకి వచ్చింది అన్నమాట. ఇక ఈ స్కీమ్ పేరు 360డీ. దీన్ని బీఓబీ 360 అని కూడా అంటారు. అయితే ఈ స్కీమ్ లో కండీషన్ ఏంటంటే.. కేవలం టెన్యూర్ ఒక సంవత్సరం మాత్రమే ఉంటుంది. అందువల్ల సంవత్సరం పాటు డబ్బులు దాచుకోవాలి అనుకున్న వారు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు.
సాధారణ పౌరులకు అందుబాటులో ఉంటుంది ఈ స్కీమ్. అంతే కాదు సీనియర్ సిటిజన్ లకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. కానీ వడ్డీ రేటులో మాత్రం మార్పు ఉంటుందట. రెగ్యూలర్ కస్టమర్లకు ఈ స్కీమ్ పై 7.1 శాతం వడ్డీ రేటు ఉంటుంది. కానీ సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. కస్టమర్లకు ఈ డిపాజిట్ ఎఫ్ డీ స్కీమ్ లో చేరాలని భావిస్తే..రూ. 1000 నుంచి డబ్బులు దాచుకోవచ్చు. కనిష్టంగా రూ. 1000 అయితే గరిష్టంగా 2 కోట్ల వరకు ఎంత డబ్బు అయినా ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు.
ఈ కొత్త ఎఫ్ డీ స్కీమ్ లో చేరాలని భావిస్తే వారికి ఆటో రెన్యువల్ సౌకర్యం కూడా ఉంటుంది. సింగిల్ గా లేదా జాయింట్ గా కూడా ఇందులో చేరవచ్చట. అంతే కాదు నామినేషన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఇక ఈ బ్యాంక్ లేటెస్ట్ ఫిక్స్ డ్ డిపాజిట్ వడ్డీ రేట్ల విషయానికి వస్తే 7 రోజుల నుంచి 10 సంవత్సరాల మధ్య కాల వ్యవధికి 4.4 శాతం నుంచి 7.25 శాతం వరకు ఉంటుంది. సీనియర్ సిటిజన్లకు అయితే 7 రోజుల నుంచి 10 సంవత్సరాల కాల వ్యవధిపై 4.75 శాతం నుంచి 7.75 శాతం వరకు వడ్డీ రేటు ఉంటుంది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. సీనియర్ సిటిజన్స్ పేరుపై డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే రెగ్యులర్ కస్టమర్లతో పోలిస్తే అధిక రాబడి వస్తుంది.