https://oktelugu.com/

Sankranti 2024 Movies: సంక్రాంతి సినిమాల్లో ఏది విజేత.. హనుమాన్ పరిస్థితి ఏంటి?

సంక్రాంతికి విడుదలైన మిగిలిన మూడు సినిమాల బుకింగ్స్ మొత్తం కలిపితే ఎంత వస్తుందో.. హనుమాన్ సినిమాకు అదే స్థాయిలో బుకింగ్స్ ఉన్నాయి. ఇక సంక్రాంతి సినిమాలలో హనుమాన్ సినిమానే టాప్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : January 16, 2024 / 03:30 PM IST

    Sankranti 2024 Movies

    Follow us on

    Sankranti 2024 Movies: చిన్న సినిమాలుగా వచ్చిన కొన్ని సినిమాలు మాత్రం మంచి హిట్ ను సొంతం చేసుకుంటాయి. కాంతార, కార్తికేయ 2, డీజే టిల్లు సినిమాలు ఏ రేంజ్ లో హిట్ ను సొంతం చేసుకున్నాయో తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలలో సంక్రాంతి పండుగ సెలవులు ముగిశాయి. ఈ రోజు నుంచి ఆఫీస్ లు మొదలయ్యాయి. ఇక నెటిజన్లు థియేటర్లకు వెళ్లడం కూడా తక్కువైంది. కొన్ని సినిమాలు ఫుల్ కలెక్షన్లు సొంతం చేసుకుంటే.. కొన్ని మాత్రం డీలా పడ్డాయి. ఇక వీక్ డేస్ లో సైతం హనుమాన్ మూవీ బుకింగ్స్ అదుర్స్ అనేలా ఉన్నాయి.

    సంక్రాంతికి విడుదలైన మిగిలిన మూడు సినిమాల బుకింగ్స్ మొత్తం కలిపితే ఎంత వస్తుందో.. హనుమాన్ సినిమాకు అదే స్థాయిలో బుకింగ్స్ ఉన్నాయి. ఇక సంక్రాంతి సినిమాలలో హనుమాన్ సినిమానే టాప్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. హనుమాన్ మూవీ కలెక్షన్లు రోజు రోజుకు పెరగడంతో ఈ సినిమాకు మంచి కామెంట్లు వస్తున్నాయి. ఇక నార్త్ లో ఇప్పటికే ఈ సినిమా పలు క్రేజీ సినిమాల కలెక్షన్ల రికార్డులను బ్రేక్ చేసిందని టాక్. దీంతో హనుమాన్ సినిమా మరో కార్తికేయ 2 సినిమాగా మారిందంటున్నారు నెటిజన్లు.

    కార్తికేయ 2 సినిమా కూడా చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అదే తరహాలో హనుమాన్ సినిమా కూడా మంచి భారీ హిట్ టాక్ తో దూసుకొనిపోతుంది. వీక్ డేస్ బుకింగ్స్ లో హనుమాన్ సినిమా అదుర్స్ అనిపిస్తోంది. అయితే ఈ సినిమా ఊహించని రేంజ్ లో దూసుకొని పోవడమే కాకుండా సరికొత్త రికార్డులను కూడా క్రియేట్ చేసుకుంటుంది. తేజ సజ్జా ప్రశాంత్ వర్మ కష్టానికి భారీ ఫలితం దక్కిందనే చెప్పాలి. ఇక హనుమాన్ సినిమా ఈ రేంజ్ లో హిట్ అవడానికి కారణం ఏదైనా కానీ సినిమా మాత్రం సూపర్ అంటున్నారు.

    పరిమిత బడ్జెట్ తో ఈ స్థాయిలో హిట్ కావడం సాధారణమైన విషయం కాదంటున్నారు నెటిజన్లు. ఇక ఈ సినిమా ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కింది. ఈ సినిమా సక్సెస్ తో ఇతర భాషల్లో సైతం తెలుగు సినిమా సత్తా మరోసారి నిరూపించుకున్నట్టుగా అయింది. ఇక ఈ సినిమా సీక్వెల్ కూడా భారీ లెవల్ లో తెరకెక్కిస్తారని టాక్.