https://oktelugu.com/

బ్యాంక్ ఖాతా ఉన్నవాళ్లకు అలర్ట్.. మేలో బ్యాంకు సెలవులివే..?

దేశంలో కోట్ల సంఖ్యలో ప్రజలకు బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. మనలో చాలామంది తరచూ బ్యాంక్ లావాదేవీల కోసం బ్యాంకులకు వెళుతూ ఉంటారు. అయితే బ్యాంక్ లావాదేవీలు తరచూ చేసేవాళ్లు బ్యాంక్ సెలవుల గురించి తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలి. సెలవుల గురించి అవగాహన ఉంటే ఆ సెలవులకు అనుగుణంగా బ్యాంక్ లావాదేవీలను నిర్వహించుకునే అవకాశం అయితే ఉంటుంది. ఏప్రిల్ నెలలో ఎక్కువ రోజులు బ్యాంకు సెలవులు ఉన్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ నెలలా మే నెలలో కూడా […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : April 26, 2021 8:54 am
    Follow us on

    దేశంలో కోట్ల సంఖ్యలో ప్రజలకు బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. మనలో చాలామంది తరచూ బ్యాంక్ లావాదేవీల కోసం బ్యాంకులకు వెళుతూ ఉంటారు. అయితే బ్యాంక్ లావాదేవీలు తరచూ చేసేవాళ్లు బ్యాంక్ సెలవుల గురించి తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలి. సెలవుల గురించి అవగాహన ఉంటే ఆ సెలవులకు అనుగుణంగా బ్యాంక్ లావాదేవీలను నిర్వహించుకునే అవకాశం అయితే ఉంటుంది.

    ఏప్రిల్ నెలలో ఎక్కువ రోజులు బ్యాంకు సెలవులు ఉన్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ నెలలా మే నెలలో కూడా ఏకంగా 12 రోజులు బ్యాంక్ సెలవులు ఉన్నాయి. కరోనా విజృంభణ వల్ల పలు రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంకులు పని చేసే టైమింగ్స్ లో కూడా మార్పులు చేసే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది. మే నెలలో 1వ తేదీన మేడే సందర్భంగా సెలవు ఉండనుంది. మే 2వ తేదీ ఆదివారం కావడంతో సెలవు దినంగా ఉంటుంది.

    మే నెల 7వ తేదీన జుమత్ ఉల్ విదా వల్ల బ్యాంకులు ఆరోజు పని చేసే అవకాశం ఉండదు. మే నెల 8వ తేదీన రెండో శనివారం కావడంతో సెలవు దినంగా ఉంటుంది. మే నెల 9వ తేదీన ఆదివారం కూడా సెలవు దినం కావడం గమనార్హం. మే నెల 13వ తేదీన ఈదుల్ ఫితర్ కాగా మే 14వ తేదీన రంజాన్, పరశురామ్ జయంతి కావడంతో సెలవు దినంగా ఉంది. మే నెల 16వ తేదీన ఆదివారం సెలవు దినంగా ఉండగా మే 22వ తేదీన నాలుగో శనివారం సెలవు దినంగా ఉంటుంది.

    మే 23వ తేదీన ఆదివారం సెలవు దినం కాగా మే 26వ తేదీన బుద్ధ పూర్ణిమ సెలవు దినంగా ఉంటుంది. మే 30వ తేదీన ఆదివారం కావడంతో సెలవు దినంగా ఉంది. బ్యాంకుల్లో పనులు ఉన్నవాళ్లు సెలవులకు అనుగుణంగా ముందే పనులు చేసుకుంటే మంచిది.