Bank Attrition: 10 టూ 4 టైమింగ్స్.. కొన్ని పనిగంటలు మినహాయిస్తే పెద్దగా రిస్క్ ఉండదు.. అత్యధిక సెలవులు.. ప్రమోషన్స్.. ఏడాదికోసారి ఇంక్రిమెంట్.. ఇలాంటి జాబ్స్ ను ఎవరైనా వదులుకుంటారా? ఇలాంటి సిచ్ వేషన్ దాదాపు బ్యాంకు సెక్టార్లలో ఉంటుంది. అందుకే బ్యాంకు జాబ్స్ అంటే చాలా మంది లైక్ చేస్తారు. అయితే బ్యాంకుల్లో ఉద్యోగం రావాలంటే ఆషామాషేం కాదు. అందుకోసం ఐబీపీఎస్ ఎగ్జామ్ పాసవ్వాలి. అందులో మెరిట్ ఉంటేనే పెద్ద బ్యాంకుల్లో అవకాశం వస్తుంది. ఇంత కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్న చాలా మంది ఇప్పుడు ఆ ఉద్యోగం వద్దు బాబోయ్ అంటున్నారు. ఇటీవల కొన్ని బ్యాంకులే చెబుతున్న లెక్కల ప్రకారం ఎంత మంది జాబ్స్ మానేశారో తెలుసుకోండి..
బ్యాంకులు మొత్తం డిజటలీకరణ అవుతున్నాయి. దీంతో ప్రతి ఒక్కరూ మొబైల్ లోనే బ్యాంకింగ్ కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకుకు వచ్చే వారి సంఖ్య తగ్గుతోంది. వినియోగదారుల సంఖ్య తగ్గడంతో అందులో పనిచేసే వారి సంఖ్య కూడా క్రమంగా క్షీణిస్తోందని కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి. కరోనా తరువాత బ్యాంకుల్లో కిందిస్థాయి సిబ్బంది ఉద్యోగులు ఇతర లక్ష్యాలు ఏర్పరుచుకొని బ్యాంకు జాబ్స్ మానేస్తున్నారు. బ్యాంకుల్లోనే కాకుండా ఫైనాన్స్ సెక్టార్లలోనూ ఈ క్షీణత పెరిగిందని బ్యాంకు ప్రతినిధులు పేర్కొంటున్నారు.
బ్యాంకుల్లో రెండో అతిపెద్ద బ్యాంకుగా కొనసాగుతున్న హెచ్ డీఎఫ్ సీ బ్యాంకులో కింది స్థాయి సిబ్బంది మానేసినట్లు ఆ బ్యాంకు ఎండీ, సీఈవో శశిధర్ పేర్కొన్నారు. ఈ బ్యాంకు మొత్తంలో 34.2 శాతం మంది ఉద్యోగం మానేశారు. అత్యధికంగా జూనియర్లు 39 శాతం మంది రిజైన్ చేశారు. 2022 జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య బ్యాంకింగ్ రంగంలో మొత్తం 24.7 శాతం ఉన్నట్లు తెలుస్తోంది. యాక్సిస్ బ్యాంకులోనూ ఇదే కొనసాగుతున్నట్లు ఆ బ్యాంకు ప్రతినిధులు తెలుపుతున్నారు. ఆ బ్యాంకులో ఫ్రంట్ లైన్ సిబ్బంది 33 నుంచి 35 శాతం తగ్గినట్లు పేర్కొంటున్నారు. యస్ బ్యాంకులో 43 శాతం ఉండగా… ఎక్కువగా సేల్స్ సిబ్బంది తమ ఉద్యోగాన్ని వదులుకున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇలా జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు బ్యాంకు అధికారులు తెలుపుతున్నారు. అయితే డిజటలీకరణ వ్యవస్థ వృద్ధి చెందడంతోనే బ్యాంకు సిబ్బంది ఇతర లక్ష్యాలు ఏర్పాటు చేసుకొని బ్యాంకు ఉద్యోగాలు వీడుతున్నట్లు మానవ వనరుల అభివృద్ధి సంస్థలు పేర్కొంటున్నాయి. 29022 మొదటి త్రైమాసికంతో పోలిస్తే ఇప్పడు బ్యాంకుల్లో 40 నుంచి 45 శాతం ఖాళీలు ఏర్పడ్డాయన్నారు. ఇదే సమయంలో 10 నుంచి 12 శాతం నియామకాలు పెరిగాయన్నారు. కానీ చాలా మంది కొత్తగా వచ్చిన వారే తమ ఉద్యోగాన్ని వీడుతున్నట్లు తెలుస్తోంది.