Chai Sutta Bar Story: ప్రతి వ్యక్తి ఉన్నత స్థాయిలో ఉండాలనుకొంటాడు. ఉద్యోగం చేయాలనుకునేవారైతే కలెక్టర్ లేదా పోలీస్ ఆఫీసర్ కావాలని కలలు గంటారు. కొందరు తమ కలను సాకారం చేసుకోలేని పక్షంలో తమ కుమారులను ఆ రంగంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. కానీ చాలా మంది నేటి కాలంలో తండ్రులు చెప్పే రంగంలోకి రావడం లేదు. సొంత నాలెడ్జ్ తో ఏదైనా వ్యాపారం నిర్వహించాలని అనుకుంటున్నారు. ఓ తండ్రి అలాగే తన కుమారుడి చేతి ఐఏఎస్ రాయించాలని అనుకున్నాడు. ఇందు కోసం కష్టపడి చదివించాడు. అయతే కుమారుడు సివిల్స్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. ఈసారి ఏకంగా ఢిల్లీ పంపించి మరీ కోచింగ్ తీసుకోవాలని పంపించాడు. కానీ తండ్రి మాటను పట్టించుకోని ఆయన చాయ కొట్టు పెట్టాడు. ఇప్పుడు ఏకంగా రూ.150 కోట్లు సంపాదిస్తున్నాడు. యువకులకు ఆదర్శంగా నిలుస్తున్న కుర్రాడి సక్సెస్ స్టోరీ మీకోసం..
ఉద్యోగం చేయడం సులువే. కానీ వ్యాపారం రాణించాలంటే ఎన్నో కష్టాలు పడాలి. ఎదురుదెబ్బలు తినాలి. అయినా ముందుకు వెళితేనే జీవితం సక్సెస్ అవుతుంది. మధ్యప్రదేశ్ లోని రేవా ప్రాంతానికి చెందిన యువకుడు అనుభవ్ దూబే. ఐఏఎస్ కోసం తన తండ్రి యూపీఎస్ సీ కోచింగ్ కోసం ఢిల్లీకి పంపించాడు. అయితే అనుభవ్ దూబే తన స్నేహితుడితో కలిసి 2016లో‘చాయ్ సుట్టా బార్’ అనే టీ కొట్టును పెట్టారు. దీనిని ఓ లేడీస్ హాస్టల్ ముందు ఏర్పాటు చేశాడు. దీనికి వినూత్న పేరుతో పాటు విభిన్నంగా టీ స్టాల్ ను ఏర్పాటు చేయడంతో తొందర్లోనే క్లిక్ అయింది. కానీ కొందరు ఈ స్టాల్ పై దాడి చేయడంతో పాటు కరోనా రావడంతో వ్యాపార నిర్వహణకు అడ్డంకులు ఏర్పడ్డాయి.
ఇదే సమయంలో అతనికి డయాబెటిక్ అటాక్ కావడంతో అనుభవ్ దూబే తీవ్రంగా కుంగిపోయాడు. ఇక తాను జీవితంలో సక్సెస్ కాలేకపోయానని అనుకున్నాడు. అప్పటికే ఇతరుత సక్సెస్ స్టోరీలను తెలుసుకున్న దూబె పట్టువదలని విక్రమార్కుడిలా మరోసారి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈసారి అతని బిజినెస్ సక్సెస్ అయింది. ఢిల్లీలోనే కాకుండా దేశంలోని 195 నగరాల్లో 450కి పైగా అవుట్ లెట్స్ ను నడిపిస్తున్నాడు.
ఎన్నో కష్టాలు పడుతూ సక్సెస్ జీవితాన్ని అనుభవిస్తున్న ఆనంద్ దూబే తన టీ స్టాళ్లలో పేపర్ కప్స్ కాకుండా మట్టి కప్ లను ఉపయోగిస్తారు. వీటిని తయారు చేయడానికి కొంత మందికి ఉపాధినిస్తున్నాడు. అంతేకాకుండా పేదరికంలో మగ్గుతున్న వారికి, వికలాంగులకు మాత్రమే తన స్టాల్స్ లో ఉపాధిని కల్పిస్తున్నాడు. ఇలా మొత్తం అవుట్ లెట్స్ నుంచి ఆయనకు ఏడాదికి రూ.150 కోట్ల రూపాయల టర్నోవర్ ఉందని ఆనంద్ దూబే ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.