Bajaj Freedom 125 CNG: భారత ఆటోమొబైల్ మార్కెట్లో టూ-వీలర్స్‌కు ఎప్పుడూ భారీ డిమాండ్ ఉంటుంది. దీనికి కారణం టూ-వీలర్స్ సరసమైన ధరలో ఉండటమే కాకుండా మంచి మైలేజీని కూడా ఇవ్వడం. అలాంటి ఒక బైక్ బజాజ్ ఫ్రీడమ్ 125. ఇది విడుదలైన కొద్దికాలంలోనే అమ్మకాల పరంగా దూసుకుపోయింది. అంతేకాదు, ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్జీ బైక్ కావడం విశేషం. మీరు కూడా తక్కువ ధరలో మంచి బైక్ కోసం చూస్తున్నట్లయితే, బజాజ్ ఫ్రీడం 125 మీకు బెస్ట్ ఆఫ్షన్ గా చెప్పవచ్చు. బజాజ్ ఫ్రీడం 125 బైక్ తక్కువ ధర, అద్భుతమైన మైలేజ్, ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తుంది. ఈ బజాజ్ సీఎన్జీ బైక్‌ను డౌన్ పేమెంట్‌తో కొనాలనుకుంటే, దాని పూర్తి ప్రాసెస్ ఈ కథనంలో తెలుసుకోండి.
Also Read : ప్రజల హృదయాలను గెలుచుకున్న మొదటి సీఎన్జీ బైక్.. ఇప్పటివరకు ఎన్ని యూనిట్లు అమ్ముడయ్యాయో తెలుసా ?
ఎంత డౌన్ పేమెంట్‌తో బైక్ లభిస్తుంది?
బజాజ్ ఫ్రీడం 125 NG04 డ్రమ్ బైక్ ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 89 వేల నుండి ప్రారంభమవుతుంది. ఈ బైక్ యొక్క ఆన్-రోడ్ ధర రూ.లక్షా 8 వేలు. Bike Dekho వెబ్సైట్ ప్రకారం..మీరు కేవలం రూ.5 వేల డౌన్ పేమెంట్‌తో ఈ బైక్‌ను కొనుగోలు చేయవచ్చు.
అలాగే, మీరు లోన్‌పై ఈ బైక్‌ను కొనాలనుకుంటే, డౌన్ పేమెంట్ తర్వాత మీరు రూ. లక్షా 3 వేల టూవీలర్ తీసుకోవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ లోన్‌ను తిరిగి చెల్లించడానికి మీరు 9.7 శాతం వడ్డీ రేటుతో మూడేళ్ల పాటు ప్రతి నెల రూ. 3 వేల 326 చొప్పున EMI చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు మొత్తం రూ.లక్షా 19 వేల 726 చెల్లించవలసి ఉంటుంది.
బజాజ్ ఫ్రీడం 125 బైక్ ఫీచర్లు
బజాజ్ ఫ్రీడం బైక్‌లో శక్తివంతమైన 125సీసీ ఇంజన్ ఉంటుంది. ఇది మెరుగైన పవర్‌తో పాటు అద్భుతమైన మైలేజీని కూడా అందిస్తుంది. దీని డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది యువతతో పాటు కుటుంబ సభ్యులను కూడా దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఈ బైక్‌లో మీకు డిజిటల్ డిస్ప్లే, LED లైట్లు, సౌకర్యవంతమైన సీటింగ్ వంటి అనేక అద్భుతమైన ఫీచర్లు లభిస్తాయి. ఈ సౌకర్యవంతమైన సీటింగ్ సుదూర ప్రయాణాలకు కూడా ఒక అద్భుతమైన ఎంపికగా చేస్తుంది.
బైక్ మైలేజ్
ఈ బైక్‌ను చాలా మంది ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఇది తక్కువ ధరలో విడుదలైంది. ఈ బైక్ 60-65 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఇది ఇంధన వినియోగం పరంగా చాలా పొదుపుగా ఉంటుంది. ఈ బైక్‌లో డిజిటల్ డిస్ప్లే, LED లైట్లు, సౌకర్యవంతమైన సీటింగ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఇవి సుదూర ప్రయాణాలకు కూడా సౌకర్యంగా ఉంటుంది. ఇది పెట్రోల్ మోడ్‌లో 130 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. ఈ రెండు ఇంధనాలు కలిసి మొత్తం 330 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తాయని కంపెనీ పేర్కొంది. దీనితో మీరు ఆగకుండా తక్కువ ఇంధన వినియోగంతో ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు.. అంతేకాకుండా సీఎన్జీ ఆప్షన్ ఉండటం వల్ల ఇది మీకు డబ్బులను మరింత ఆదా చేస్తుంది.
Also Read : టీవీఎస్ అపాచీ నుంచి బజాజ్ పల్సర్ వరకు ఏబీఎస్ టెక్నాలజీలో వచ్చే బడ్జెట్ బైక్స్ ఇవే