Chetak scooter : మన కలల ‘చేతక్’ స్కూటర్ వచ్చేసింది.. ధర కూడా చీప్.. విశేషాలు తెలిస్తే కొనేస్తారు

దేశంలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ యుగం నడుస్తోంది. టూ వీలర్ నుంచి ఫోర్ వీలర్ వరకు విద్యుత్ వాహనాలను కొనేస్తున్నారు.కంపెనీలు సైతం పెట్రోల్, డీజిల్ వాహనాలకు బదులకుగా ఎలక్ట్రిక్ వెహికల్స్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఎలక్ట్రిక్ ఈవీ స్కూటర్లు బజాన్ నుంచి ఇప్పటికే కొన్ని మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి.

Written By: Chai Muchhata, Updated On : August 28, 2024 3:05 pm

Chetak scooter

Follow us on

Chetak scooter : ఒకప్పుడు చేతక్ స్కూటర్ ఉన్న వారు మహారాజులా ఫీలయ్యేవారు. బజాన్ నుంచి మార్కెట్లోకి వచ్చిన ఈ మోడల్ దశాబ్దాలుగా టూవీలర్ల మనసును దోచుకుంది. అయితే కొన్నేళ్ల కిందట బైక్ లు అందుబాటులోకి రావడంతో చేతక్ కనుమరుగు అయిపోయింది. మళ్లీ ఇప్పుడు చేతక్ గురించి ఆసక్తి కర చర్చ సాగుతోంది. ఎందుకంటే బజాజ్ నుంచి చేతక్ పేరుతో కొత్త స్కూటర్ మార్కెట్లోకి రాబోతుంది. ఇప్పటికే దీని పేరు మీద చేతక్ 2901 మోడల్ మార్కెట్లోకి వచ్చింది. ఇప్పుడు చేతక్ 2903 సరికొత్తగా రాబోతుంది. ఎలక్ట్రిక్ వేరియంట్ అయిన ఈ స్కూటర్ కు సంబంధించి వివరాలు ఇటీవల బయటకు వచ్చాయి. దీంతో ఈ ఫీచర్ ను చూసి చేతక్ ప్రియులు షాక్ అవుతున్నారు. ఇంతకీ ఈ మోడల్ ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

దేశంలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ యుగం నడుస్తోంది. టూ వీలర్ నుంచి ఫోర్ వీలర్ వరకు విద్యుత్ వాహనాలను కొనేస్తున్నారు.కంపెనీలు సైతం పెట్రోల్, డీజిల్ వాహనాలకు బదులకుగా ఎలక్ట్రిక్ వెహికల్స్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఎలక్ట్రిక్ ఈవీ స్కూటర్లు బజాన్ నుంచి ఇప్పటికే కొన్ని మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే వీటిలో చేతక్ 2901 అనే మోడల్ కు అప్ గ్రేడ్ తో రాబోతుంది. మారిన టెక్నాలజీకి అనుగుణంగా వినియోగదారులను ఆకర్షించేందుకు ఈ స్కూటర్ ఇంజిన్, డిజైన్లలో పలు మార్పులు చేశారు. ఈ కొత్త స్కూటర్ ఎలా ఉందంటే?

బజాజ్ కంపెనీ ఇటీవల జూలై సేల్స్ రిపోర్టును బయటపెట్టింది. దీని ప్రకారం చేతక్ ఎలక్ట్రిక్ వేరియంట్ 344 శాతం వృద్ధి సాధించినట్లు తెలిసింది. దీనిని బట్టి చూస్తే ఈ ఈవీకి ఎంత ప్రాధాన్యం ఉందో తెలుస్తోంది. ఇలాంటి సమయంలో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ 2903 మోడల్ మార్కెట్లోకి రాబోతుంది. ఈ స్కూటర్ లో 2.9 కిలో వాట్ బ్యాటరీ పాక్ ను కలిగి ఉంది.ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 123 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. అలాగే ఈ మోడల్ లో 4 కేవీ ఎలక్ట్రిక్ మోటార్ ను అమర్చారు. ఇది గరిష్టంగా గంటకు 63 కిలోమీటర్ల వేగంతో దూసుకు వెళ్తోంది.

చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ 2901లో ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం లేదు. అయితే ఇప్పుడు 2903లో ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. ఇందులోని ఫీచర్స్ విషయానికొస్తే డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. హిల్ హోల్ట్, రివర్స్, స్పోర్ట్ అండ్ ఎకానమి మోడ్ ఉన్నాయి. మ్యూజిక్ కంట్రోల్ చేసే ఫాలో మీ హోమ్ లైట్లు ఆకర్షిస్తాయి. బ్లూటూత్ యాప్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఇందులో చూడొచ్చు.

కొత్త చేతక్ స్కూటర్ ఆరు కలర్లలో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. వటిలో వైట్, రెడ్, ఎల్లో, బ్లాక్, బ్లూ రంగుల్లో లభ్యమవుతుంది. చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ 2903ని 1.2 లక్షలతో విక్రయించే అవకాశం ఉంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న 2901 కంటే ఇది రూ.20 వేలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇందులో అప్ గ్రేడ్ ఫీచర్లతో పాటు ఆకర్షణీయమైన సౌకర్యాలు ఉండే అవకాశం ఉంది.