Sukanya Samriddhi Yojana: కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘సుకన్య సమృద్ధి పథకం’ ఆడపిల్లలకు వరం లాంటిది. చిన్న మొత్తాల పొదుపు ద్వారా భవిష్యత్ లో ఆమ్మాయిలకు పథకం ఎంతో ప్రయోజనం చేకూరనుంది. దీంతో చాలా మంది ఆడపిల్లలు ఉన్న వారు సుకన్య సమృద్ధి పథకంలో చేరారు. కొంత మంది ఇప్పటికీ చేరుతున్నారు. అయితే ఈ పథకంలో కొన్ని మార్పులను చేశారు. ఇవి అక్టోబర్ 1 నుంచి వర్తిస్తాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు. సుకన్య సమృద్ధి పథకం మాత్రమే కాకుండా, జాతీయ పొదుపు పథకం, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీముల్లోనూ కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..
సుకన్య సమృద్ధి పథకం గురించి ఇప్పటికే చాలా మంది ఆడపిల్లలు ఉన్నవారికి తెలుసు. ఈ పథకం ప్రకారం.. ఆడపిల్లల పేరిట డబ్బును డిపాజిట్ చేసుకుంటూ పోతే వారి చదువు, విహా సమయంలో మెచురిటీ మొత్తాన్ని తీసుకోవచ్చు. పదేళ్ల లోపు బాలికలు ఉన్న వారు ఈ ఖాతాను తీసుకోవచ్చు. రూ. 250 నుంచి రూ.1.50 వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. లేదా నెలకు కొంత మొత్తాన్ని చెల్లించి డిపాజిట్ చేయొచ్చు. అమ్మాయికి 18 ఏళ్ల వయసు వచ్చే సరికి చదువు కోసం డబ్బు అవసరం అయితే తీసుకోవచ్చు. ఆ తరువాత 21 ఏళ్లకు మెచురిటీ అమౌంట్ ను తీసుకోవచ్చు. ఈ పథకంలో తాజాగా వచ్చిన మార్పులు ఏవంటే.. ఇప్పటి వరకు అమ్మాయిల పేరు, ఆమె తండ్రి లేదా సంరక్షకుడు కలిసి ఈ ఖాతాలో భాగస్వామ్యం ఉంటారు. అయితే ఈ ఖాతాలో బాలికకు ఇతర సంరక్షకులు ఉంటే వారి స్థానంలో తల్లిదండ్రులకు మార్చుకోవచ్చు. అలాగే రెండు కంటే ఎక్కువ ఖాతాలు ఉండరాదు.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ తో పాటు నేషనల్ సేవింగ్స్ స్కీమ్స్ కు సంబంధించి కొత్త మార్గదర్శకాలు విడుదల అయ్యాయి. వీటి ప్రకారం ఖాతా ఓపెనింగ్ లో జరిగిన పొరపాట్లను సరిదిద్దు కోవచ్చు. ఈ పొరపాట్లలో 1990 కి ముందు ఖాతాలు తెరవబడితే వాటిని ప్రస్తుతం స్కీం ప్రకారంగా మార్చుకోవచ్చు. ఇలా చేస్తే బ్యాలెన్స్ పై 2 శాతం వడ్డీని పొంద వచ్చు. వార్సిక పరిమితిలోపు డిపాజిట్లు ఉంటే ప్రాథమిక ఖాతా ప్రకారం వడ్డీని పొందుతారు. అయితే ఎక్కువ ఖాతాలు కలిగి ఉంటే వాటిని మెయిన్ ఖాతాలోకి విలీనం చేసుకోవచ్చు. అయితే అవి క్లోజ్ చేయబడినప్పుడు ఎలాంటి వడ్డీలు చెల్లించే ఆస్కారం ఉండదు.
పబ్లిక్ ప్రావిడెంట్ ఖాతాల్లో మైనర్లు ఉంటే వారికి 18 ఏళ్లు వచ్చే వరకు పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతా రూల్ ప్రకారం వడ్డీని చెల్లిస్తారు. అయితే మెచ్యరిటీ మొత్తం 18వ పుట్టిన రోజు నుంచి లెక్కిస్తారు. కొత్త ఖాతాలు తెరిచేవారు ఈ నిబంధనల గురించి పూర్తిగా అవగాహన కు రావాల్సి ఉంటుంది. పాత రూల్స్ ప్రకారంగా ప్రస్తుతం ఖాతాలు సాగవని తెలుసుకోవాలి. అలాగే నిబంధనల మార్పులకు అనుగుణంగా ఖాతాలను క్రమబద్దీకరించడానికి బ్యాంకులు రెడీ అయ్యాయి. కొత్త నిబంధనల గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే సంబంధిత పోస్టాషీసు కార్యాలయాల్లో కలవవొచ్చు.