https://oktelugu.com/

Ester Noronha: నోయల్ ఆ హీరోయిన్ తో ఇంత బాగోతం నడిపాడా..? సంచలన నిజాలు బయటపెట్టిన మాజీ భార్య..ఇంతకీ ఎవరు ఆ హీరోయిన్?

బిగ్ బాస్ షో లో ఉన్నప్పుడు ఆయన తన మాజీ భార్య ఈస్టర్ గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్న సందర్భం ఒకటి ఉంది. నా మాజీ భార్య వల్ల నేను ఎంతో మనస్తాపానికి గురి అయ్యానని, చాలా కాలం వరకు ఆమెని భరించానని, కానీ ఇక ఓపిక నశించి విడిపోవాల్సి వచ్చిందని ఆయన చెప్పుకొచ్చాడు. దీనిపై ఈస్టర్ కూడా పలు సందర్భాలలో చాలా ఘాటుగా స్పందించింది.

Written By:
  • Vicky
  • , Updated On : August 28, 2024 / 03:00 PM IST

    Ester Noronha

    Follow us on

    Ester Noronha: టాలీవుడ్ లో ఇప్పుడున్న క్యారక్టర్ ఆర్టిస్టులలో ఆడియన్స్ కి బాగా దగ్గరైన వారిలో ఒకరు నోయల్. కేవలం నటుడిగా మాత్రమే కాదు, ఈయన గాయకుడిగా కూడా ఇది వరకు ఎన్నో సినిమాలకు పనిచేసాడు. ‘విక్రమార్కుడు’, ‘చందమామ’, ‘మంత్ర’, ‘విక్టరీ’ ఇలా ఒక్కటా రెండా, ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు ఆయన పాటలు పాడాడు. ఒకపక్క పాటలు పాడుతూనే, మరోపక్క క్యారక్టర్ ఆర్టిస్టుగా కూడా వరుసపెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ గా గడిపేవాడు. అంతే కాదు ఈయన స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే బిగ్గెస్ట్ రియాలిటీ షోస్ లో ఒకటైన బిగ్ బాస్ సీజన్ 4 లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు. అద్భుతంగా గేమ్స్ ఆడుతూ బాగా రాణించాడు కానీ, మధ్యలో ఆయన కాళ్లకు గాయం అవ్వడం వల్ల షో నుండి వైదొలగడం జరిగింది. వెళ్లేముందు ఆయన అమ్మా రాజశేఖర్ మరియు అవినాష్ మీద ఫైర్ అవుతూ స్పందించిన విధానాన్ని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు.

    ఇవన్నీ పక్కన పెడితే బిగ్ బాస్ షో లో ఉన్నప్పుడు ఆయన తన మాజీ భార్య ఈస్టర్ గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్న సందర్భం ఒకటి ఉంది. నా మాజీ భార్య వల్ల నేను ఎంతో మనస్తాపానికి గురి అయ్యానని, చాలా కాలం వరకు ఆమెని భరించానని, కానీ ఇక ఓపిక నశించి విడిపోవాల్సి వచ్చిందని ఆయన చెప్పుకొచ్చాడు. దీనిపై ఈస్టర్ కూడా పలు సందర్భాలలో చాలా ఘాటుగా స్పందించింది. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో విడాకుల ప్రస్తావనని ఒక యాంకర్ తీసుకొని రాగా, దానికి ఆమె సమాధానం చెప్తూ ‘నేను ఎక్కడికి వెళ్లినా విడాకుల ప్రస్తావనే తీసుకొస్తున్నారు. నన్ను అడగడానికి మీ దగ్గర వేరే ప్రశ్నలు ఏమి లేవా’ అంటూ కాస్త చిరాకు పడింది.

    ఆ తర్వాత నోయల్ గురించి మాట్లాడుతూ ‘అతను ఆన్ స్క్రీన్ లో ఎలాంటి నటుడని బయట జనాలు అనుకుంటారో నాకు తెలియదు కానీ, ఆఫ్ స్క్రీన్ లో మాత్రం మహానటుడు. తప్పు తన వైపు ఉంచుకొని, నా వైపుకు అతను తిప్పే ప్రయత్నాన్ని చూసి ఆశ్చర్యపోయాను. పైగా కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తున్నాడు’ అంటూ చెప్పుకొచ్చింది. అసలు మీరు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అని యాంకర్ ఆమెని అడగగా., దానికి ఆమె సమాధానం చెప్తూ ‘ వైవాహిక బంధంలో భార్య అయినా, భర్త అయినా ఒక్కసారి తప్పు చెయ్యడం సహజం. బంధం నిలుపుకోవాలి అనుకునేవారు క్షమిస్తారు. నేను కూడా అదే చేశాను. కానీ పదే పడే అదే తప్పు చేస్తుండడం చూసి విసుగొచ్చి వదిలేసాను’ అంటూ చెప్పుకొచ్చింది. ఇంతకీ నోయల్ చేసిన ఆ తప్పేంటి అని యాంకర్ అడగగా, దానికి ఆమె సమాధానం ఇస్తూ ‘నేను రెడ్ హ్యాండెడ్ గా అతన్ని మూడు సార్లు సినీ హీరోయిన్స్ తో బెడ్ రూమ్ లో కలిసి ఉండడం చూసాను..అందుకే విడిపోయాను’ అంటూ చెప్పుకొచ్చింది.