Auto Sector Talent Drive: ఇటీవల కాలంలో ఉద్యోగాల కోత వార్తలు ప్రతి రోజు వింటూనే ఉన్నాం. Artificial intelligence (AI) అందుబాటులోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల జీవితాలు మరింత కష్టతరంగా మారాయి. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు ఏఐని ఉపయోగించుకుంటూ కొందరు ఉద్యోగులను పక్కన పెడుతున్నాయి. అయితే ఉన్న వారిని సైతం తక్కువ జీతంతో పని చేయించుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆటోమొబైల్ రంగం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంది. తమ రంగానికి చెందిన ఉద్యోగులకు రెండు అంకెల జీతాన్ని పెంచుతూ మిగతా రంగాలకు కంటే దీటుగా నిలుస్తుంది. 2025 ఆర్థిక సంవత్సరంలో 10.1 శాతం జీతాల పెంపుతో ఈ రంగం ముందంజలో ఉంటూ ప్రత్యేకంగా నిలుస్తుంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే..
‘పర్ఫార్మెన్స్ అండ్ రివార్డ్ ట్రెండ్ స్టడీ’ ప్రకారం ఇతర కార్పొరేట్ సంస్థల కంటే భారతీయ ఆటోమొబైల్ కంపెనీలు 2025 మొదటి ఆర్థిక సంవత్సరంలో 10.1% జీతాల పెంపును జారీ చేసే అవకాశం ఉందని తెలిపింది. అయితే వీటిలో ఇప్పటికే మార్చి వరకు కొన్ని కంపెనీలు రెండు అంకెల జీతాలను పెంచాయి. మరికొన్ని కంపెనీలు జూన్ పూర్తిలోగా పెంచే అవకాశం ఉందని తెలిపింది. ఆటోమొబైల్ రంగంలోకి డిజిటలైజేషన్, ఏఐ, ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులోకి వస్తున్నప్పటికీ మానవ వనరుల అవసరం ఎంతో ఉందని గుర్తించింది. వీరిలో ప్రతిభ అన్న వారికి మరింత డిమాండ్ ఉన్నట్లు స్కోడా ఆటో వోక్స్వ్యాగన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హెచ్ఆర్ అధిపతులు తెలుపుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నైపుణ్యం సాధించిన వారికి రెండు అంకెలకంటే ఎక్కువే జీతాలు పెంచుతున్నట్లు వారు పేర్కొన్నారు.
అయితే గత ఐదేళ్ల ఆటోమొబైల్ రంగం జీతాల పెంపు విషయంలో పై చేయి సాధిస్తుంది. మొత్తంగా జీతాల పెంపు శాతం అధికంగా ఉన్నప్పటికీ గత సంవత్సరం కంటే వేతనాలు తక్కువేనని డిలైట్ ఇండియా భాగస్వామి నీలేష్ గుప్తా అన్నారు. గత ఏడాది ఆటోమోటివ్ రంగం 10.5% వేతన పెంపును జారీ చేసింది. అయితే ఈ ఏడాది మొదటి ఆర్థిక సంవత్సరం సంఘటన 8.8% ఉందని తెలిపారు. అయితే ఈ సంవత్సరం అంచనాలకు అనుగుణంగానే జీతాల పెరుగుదల ఉంటుందని సోనాలిక గ్రూప్ కార్పొరేట్ హెచ్ఆర్ ప్రతినిధులు తెలిపారు. కొన్ని సంస్థల్లో సింగిల్ డిజిట్ జీతాలు పెరుగుతున్నప్పటికీ గతంలో కంటే ఇవి ఎక్కువ ఉన్నాయని VW గ్రూప్ అధినేత శర్మచిల్లారా పేర్కొన్నారు. అయితే ఓవైపు ప్రస్తుతం అవసరమయ్యే ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకుంటూనే మరోవైపు మానవ వనరులను ఉపయోగించి ఉత్పత్తి చేస్తామని ఆయన తెలిపారు. టాప్ లెవల్ లో పెర్ఫార్మెన్స్ చూపించే వారికి రెండేంకల జీతం కచ్చితంగా ఉంటుందని కొన్ని కంపెనీల ప్రతినిధులు తెలుపుతున్నారు.
Also Read: New Cars : కొత్త కార్ల పోటీ నుంచి తట్టుకొని నిలబడ్డ పాతకాలం.. ఈ కారు గురించి తెలుసా?
కరోనా తర్వాత ఆటోమొబైల్ రంగం వృధిలో కొనసాగుతుందని.. టెక్నాలజీ తో పాటు డిజిటలైజేషన్ను ఉపయోగించుకుంటూ అన్ని విభాగాల్లో సరైన ఉత్పత్తి చేస్తుందని ఆటోమొబైల్ రంగం నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో భాగంగానే కంపెనీలు వృద్ధిలో ఉండడం వల్ల జీతాల పెంపు విషయంలో ఏమాత్రం వెనకాల అడుగు వేయడం లేదని అంటున్నారు.