ATM Withdraw : ప్రస్తుత కాలంలో మనీ ట్రాన్సాక్షన్ అంతా ఆన్లైన్ లోనే సాగుతుంది. అయితే కొన్ని సార్లు సాంకేతిక సమస్యల వల్ల.. మొబైల్ లోని సమస్యల వల్ల మనీ ట్రాన్సాక్షన్ సరిగ్గా ఉండడం లేదు. దీంతో చాలామంది మరోసారి ఏటీఎంలను ఆశ్రయిస్తున్నారు. అయితే కొన్ని కారణాలవల్ల ఏటీఎం చార్జీలు మారిపోతున్నాయి. వినియోగదారుల ట్రాన్సాక్షన్ ఏటీఎంలో ద్వారా పరిమితికి మించితే.. చార్జీలు పడే అవకాశం ఉందనే విషయం ఇప్పటికే తెలుసు. కానీ ఈ చార్జీల మోత మరోసారి పెరగనుంది. ఇవి మే ఒకటి నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ వివరాలు ఎలా ఉన్నాయి అంటే?
Also Read : ఏపీలో కానిస్టేబుల్ తుది రాత పరీక్షకు ఐదు కేంద్రాలు!
ప్రస్తుతం ఒక బ్యాంకు నుంచి ఏటీఎం ద్వారా నగదు ఉపసంహరణ చేసుకుంటే ఐదుసార్లు ఉచితంగా అవకాశం ఇచ్చారు. అంతకుమించితే చార్జీలు విధిస్తున్నారు. అయితే ఈ చార్జీలు మే 1 తేదీ నుంచి కొత్తగా అమల్లోకి రానున్నాయి. ఇవి ప్రస్తుతం రూ.21 నుంచి రూ. 23 కు చేరే అవకాశం ఉంది. ఇవి ఆయా బ్యాంకులను బట్టి కూడా ఉండే అవకాశం ఉంది. పట్టణాలు, నగరాల్లో ఈ చార్జీలు విభిన్నంగా ఉండలు ఉన్నాయి. అయితే వినియోగదారులు అత్యవసరం అయితే తప్ప మిగతా బ్యాంకుల ద్వారా నగదు ఉపసంహరణ చేసుకోవద్దని కొందరు సూచిస్తున్నారు. ఎందుకంటే అదే పదే ఏటీఎం ల ద్వారా నగదు ఉపసంహరణ చేయడం వల్ల అదనపు చార్జీలను ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు.
గతంలోనూ పలుసార్లు ఏటీఎంలో చార్జీలు పెరుగుతూ వస్తున్నాయి. కానీ ప్రస్తుతం మరోసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంల ద్వారా ట్రాన్సాక్షన్ చేసేవారికి చార్జీల విధింపు పెంచుతున్నారు. కేవలం నగదు ఉపసంహరణ మాత్రమే కాకుండా బ్యాలెన్స్ ఎంక్వయిరీ, మినీ స్టేట్మెంట్ వంటి వాటికి కూడా చార్జీలు విధిస్తున్నారు. అయితే ఈ చార్జీలు నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కు వేరే విధంగా ఉన్నాయి. అంతేకాకుండా మెట్రో నగరాలకు చార్జీలు అదనంగా విధించే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఆన్లైన్ లో మనీ ట్రాన్సాక్షన్ ఎక్కువగా జరుపుతున్న.. కొంతమంది ఏటీఎంలో ద్వారానే నగదును ఉపసంహరించుకోవడానికి ఇష్టపడుతున్నారు. అయితే చాలా చోట్ల ఏటీఎంలో సరిగా పనిచేయడం లేదు. ఈ క్రమంలో ఒక బ్యాంకు అకౌంట్ కలిగిన వారు మరో బ్యాంకు ద్వారా నగదు ఉపసంహరించుకుంటున్నారు. ఇలా పలుసార్లు చేయడం వల్ల అత్యధిక చార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో సొంత బ్యాంకు ఎటిఎం పనిచేయక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే చాలామంది ఏటీఎంలో పనిచేయడం లేదని ఫిర్యాదు చేస్తున్నారు. కానీ బ్యాంకులు మాత్రం ఇతర బ్యాంకుల ద్వారా నగదు ఉపసంహరణ చేసుకుంటే చార్జీలు అదనంగా విధిస్తున్నాయి.
ప్రస్తుతం భారతదేశంలో 2025 జనవరి నాటికి 2,16,706 ఏటీఎంలు పనిచేస్తున్నాయి. వీటిలో కొన్నిసార్లు సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని నగరాల్లో ఏటీఎంలో అత్యవసర సమయంలో పనిచేయడం లేదు. ఇలాంటి వాటి విషయంలో బ్యాంకు అధికారులు ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని కోరుకుంటున్నారు.
Also Read : SIP ఇన్వెస్ట్మెంట్ చేసి ఆపేస్తున్నారా? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి.