SIP Investments: డబ్బు సంపాదించడం అందరికీ తెలిసిన విషయమే. కానీ దానికి సరైన మార్గంలో కొందరు మాత్రమే పెట్టుబడులు పెడతారు. అయితే దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెట్టాలని అనుకునేవారు కీలక నిర్ణయాలు తీసుకోవాలి. అంతేకాకుండా ఆర్థిక నిపుణుల సలహా మేరకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ప్రస్తుత కాలంలో చాలామంది సింపుల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP) చేస్తున్నారు. ఇందులో పెట్టుబడులు పెట్టిన వారు కాస్త సమయం తీసుకోవాలి. కానీ కొందరు మాత్రం ఇలా పెట్టుబడులు పెట్టి అలా లాభాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తక్కువ లాభాలు అర్జించిన వారు వాటిని మధ్యలోనే వదిలేస్తున్నారు. వాస్తవానికి సింపుల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ తాత్కాలిక పెట్టుబడులకంటే దీర్ఘకాలిక పెట్టుబడులుగా భావించి చేయడమే మంచిదని అంటున్నారు. అసలు ఎంతకాలం వీటిని పెట్టుబడులు పెట్టాలి?
కొంతమంది ఆర్థిక నిపుణులు చెబుతున్న ప్రకారం.. సింపుల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది చాలా లాంగ్ ప్రక్రియ. ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసేవారు కనీసం ఐదు నుంచి పది సంవత్సరాల వరకు వెయిట్ చేయాలని అంటున్నారు. అలా అయితేనే మంచి రిజల్ట్ పొందుతారని చెబుతున్నారు. అంతేకాకుండా కొందరు దీనిని ప్రారంభించి మధ్యలోనే వదిలేస్తున్నారు. అలా చేయడం వల్ల ఎంత మాత్రం ప్రయోజనం కాదని అంటున్నారు. ఒకసారి షిప్ ఇన్వెస్ట్మెంట్ చేసి లేదా నెల నెల ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇది లాంగ్ పీరియడ్ ఉంటేనే ఎంతో లాభం అని అంటున్నారు.
కొన్ని అధ్యయనాల ప్రకారం కనీసం 10 ఏళ్ల పాటు షిఫ్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే రెట్టింపు లాభాలు కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. కొన్ని నివేదికన ప్రకారం ఒక సంవత్సరం షిప్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే -3.8% నుంచి ప్రారంభమవుతుందని తెలుస్తోంది. అంటే మొదట్లో ఇది తక్కువ అనిపించినా ఆ తర్వాత తిరిగి అవకాశం ఉందని అంటున్నారు. చివరిలో ఈ పర్సంటేజ్ 20% అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. అందువల్ల SIP చేయాలనుకున్నవారు.. దీర్ఘకాలికంగా ఆలోచించాలని అంటున్నారు.
అయితే ఈ పెట్టుబడుల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలని అంటున్నారు. ఈ ఇన్వెస్ట్మెంట్ చేసే సమయంలో నిపుణుల సలహా మేరకు పెట్టుబడులు పెట్టాలని అంటున్నారు. కొన్ని కంపెనీలు ఎప్పటికీ నష్టాల్లోనే ఉంటాయి. వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉండవని అంటున్నారు. అందువల్ల ప్రముఖ కంపెనీల పై మాత్రమే పెట్టుబడులు పెట్టేలా అవగాహన పెంచుకోవాలని అంటున్నారు. అంతేకాకుండా ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసేవారు తక్కువ మొత్తం నుంచి ప్రారంభించాలని.. ఈ పెట్టుబడులు సాధారణ జీవనానికి భంగం కలగకుండా ఉండాలని అంటున్నారు. ఎందుకంటే ఇందులో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం వల్ల రోజువారి జీవితంపై ప్రభావం పడుతుందని.. అంతేకాకుండా ఇది దీర్ఘకాలిక పెట్టుబడులు అయినందువల్ల.. మధ్యలోనే వదిలేయడం అంత మంచిది కాదని అంటున్నారు. అయితే దీర్ఘకాలికంగా ఈ పెట్టుబడులు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని.. ముఖ్యంగా పిల్లల కోసం ఈ పెట్టుబడులు ఎన్నో లాభాలు తీసుకొస్తాయని ఆర్థిక నిబంధనలు తెలుపుతున్నారు.