ATM Card : డబ్బులు డ్రా చేసుకోవడానికి Any Time Mission(ATM) మిషన్లు ఎంతో ఉపయోగపడుతాయి. ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు డబ్బులు తీసుకోవచ్చు. కొన్ని బ్యాంకులు నగదు తీసుకోవడానికి భారీగా పరిమితులు కూడా ఇస్తున్నాయి. దీంతో చాలా మంది బ్యాంకులకు వెళ్లడం మానేసి ఏటీఎం ల ద్వారానే క్యూ కడుతున్నారు. ఏటీఎం ద్వారా డబ్బు డ్రా చేసుకోవడం ఎంత సులువో అన్ని ప్రమాదాలు ఉన్నాయి. ముఖ్యంగా సైబర్ నేరగాళ్ల బెడద ఎక్కువగా ఉంటోంది. ఈ తరుణంలో ఏటీఎం మిషన్ వద్ద ఇలాంటి సంఘటన జరిగినప్పుడు వెంటనే అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది.
చాలా మందికి ఏటీఎం గురించి పూర్తిగా అవగాహన రావడం లేదు. దీంతో కొంత మంది ఏటీఎం వద్దకు వచ్చి ఇతరుల సాయం తీసుకుంటూ ఉంటారు. అయితే కొన్ని చోట్ల ఇలా సాయం అడగడాన్ని ఆసరాగా తీసుకొని వారి బ్యాంకులోని డబ్బును దోచుకుంటున్నారు. వారి ద్వారా వారికి తెలియకుండానే పిన్ నెంబర్ ను తెలుసుకొని జేబు గుళ్ల చేస్తున్నారు. ఇంకో చోట ఏటీఎం కార్డు మిషన్లో పెట్టగానే అది ఇరుక్కు పోతుంది. దీనిని తీసుకోవడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదు. ఇది కూడా ఒక మోసమే అని గుర్తించాలి.
కొందరు సైబర్ నేరగాళ్లు ఏటీఎం మిషన్ లోని కార్డు రీడర్ ను తీసేస్తున్నారు. ఇలా కార్డ్ రీడర్ ను తీసేయడం ద్వారా అందులో కార్డు పెట్టగానే అది అక్కడే ఆగపోతుంది. ఇదే సమయంలో సైబర్ నేరగాళ్లు అక్కడికి వచ్చి సాయం చేస్తామని అంటారు. దీంతో పిన్ నెంబర్ ను అడుగుతారు. అలా పిన్ నెంబర్ తెలుసుకొని ప్రయత్నించినట్లు చేస్తారు. అప్పటికీ రావడం లేదని చెప్పడంతో కార్డు దారు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తరువాత సైబర్ నేరగాడు ఆ కార్డు ద్వారా డబ్బులు డ్రా చేసుకుంటారు.
ఇవే కాకుండా ఏటీఎం మిషన్ దగ్గరికి వచ్చే వారిని తికమక పెట్టి వారి పిన్ నెంబర్ తెలుసుకొని డబ్బులు డ్రా చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సమయంలో ఏటీఎం పిన్ ఎంట్రీ చేసేటప్పుడు ఇతరులకు కనిపించకుండా జాగ్రత్త పడాలి. ఏటీఎంలో మరో వ్యక్తి ఉన్నప్పుడు అక్కడికి వెళ్లకుండా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో కార్డు వివరాలు ఇతరులకు చెప్పకుండా ఉండాలి. ఎవరైనా సైబర్ క్రైమ్ కు పాల్పడుతున్నట్లు కనిపిస్తే వెంటనే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి.