https://oktelugu.com/

4 Lackhs Sales Car: 4 ఏళ్లలో 4 లక్షల అమ్మకాలు.. ఈ కారు గురించి తెలుసా?

కియా సోనెట్ ప్రస్తుతం 28 విభిన్న వేరియంట్లలో లభిస్తుంది. 7 రంగుల్లోకారు లభించనుంది. దీనిని రూ.7.99 లక్షల నుంచి రూ.15.75 లక్షల వరకు విక్రయించనున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : April 30, 2024 3:10 pm
    kia-sonet

    kia-sonet

    Follow us on

    4 Lackhs Sales Car:  దక్షిణ కొరియా కంపెనీకి చెందిన కియా భారత రోడ్లపై దూసుకెళ్తోంది. ఈ కంపెనీ నుంచి బయటకు వచ్చిన అనేక మోడళ్లు ఆకట్టుకున్నాయి. ఇందులో సోనెట్ కారుకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. ఎంతలా అంటే ఈ కారు రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 4 లక్షల యూనియట్లు దాటింది. 4 ఏళ్లలో 4 లక్షల యూనిట్లు దాటిన ఈ కారు గురించి ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. ఈ కారు వివరాల్లోకి వెళితే..

    కియా సోనెట్ మూడు ఇంజిన్లను కలిగి ఉంది. ఇందులో రెండు పెట్రోల్, ఒకటి డీజిల్ ఫ్యూయెల్ ను కలిగి ఉంది. పెట్రెల్ ఇంజిన్ విషయానికొస్తే.. 1.2 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ ఇంజిన్ 83 బీహెచ్ పీ పవర్ 115 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. మరో ఇంజన్ 1.0 లీటర్, 120 బీహెచ్ పీ పవర్, 172 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. మూడో ఇంజిన్ 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది 100 బీహెచ్ పీ పవర్ తో పాటు 240 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

    కియా సోనెట్ స్పోర్టీ కారు డిజైన్ మోడల్ ఓ ఉంటుంది. ఇందులో 16 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, గేర్ లివర్, క్యాబిన్ సాప్ట్ టచ్ మెటిరీయల్స్, లెథరేట్ ఆప్హోల్సరీ సీట్లు, ఉన్నాయి. స్టీరింగ్ వీల్ , సైడ్ డోర్ ప్యానెల్ లు ఉన్నాయి. అల్లాయ్ వీల్స్ తో పాటు ఆర్చెస్ క్లాడింగ్ ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్ సిల్వర్ పినిషెడ్ రూప్ రైల్ అమరచారు. కారు వెనక భాగంలో హార్ట్ బీట్ఖ లైట్ ల్యాంప్స్ ఉన్నాయి. క్రోమ్ డోర్ హ్యాండిల్ ఇందులో అకర్షిస్తుంది. ఎల్ ఈడీ డీఆర్ఎల్ లు, ఎలక్ట్రిక్ సన్ రూప్, వెంటిలేటేడ్ సీట్లు ఆకర్షిస్తాయి.

    కియా సోనెట్ ప్రస్తుతం 28 విభిన్న వేరియంట్లలో లభిస్తుంది. 7 రంగుల్లోకారు లభించనుంది. దీనిని రూ.7.99 లక్షల నుంచి రూ.15.75 లక్షల వరకు విక్రయించనున్నారు. కియా సొనెట్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ను కలిగి ఉంది. ఈ మధ్య ఎక్కువగా సన్ రూఫ్ కొరుకునేవారు ఎక్కవయ్యారు. దీతో ఈ కారు సేల్స్ బాగా పెరిగాయి. అలా మొత్తం లక్షల యూనిట్లు విక్రయించబడ్టాయి. పెట్రోల్, డీజిల్ ఇంజిన్ల అమ్మకాలు వరుసగా 63 శాతం, 37 శాతంగా నమోదయ్యాయి. 2020 నుంచి 37.5 శాతం వృద్ధితో కొనసాగుతూ వచ్చింది.