అటల్ పెన్షన్ యోజన స్కీమ్ లో చేరడం ద్వారా 60 సంవత్సరాల తర్వాత ప్రతి నెలా 1,000 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు పెన్షన్ ను పొందే అవకాశం ఉంటుంది. 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ స్కీమ్ లో చేరవచ్చు. ఒక వ్యక్తి ఈ స్కీమ్ లో చేరితే కనీసం 20 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ లో చేరిన వాళ్లు నెలకు 42 రూపాయల నుంచి 210 రూపాయల వరకు చెల్లించాలి.
18 సంవత్సరాల వయస్సులో చేరితే మాత్రమే ఈ మొత్తం చెల్లించాలి. ఒకవేళ 40 సంవత్సరాల వయస్సులో ఈ స్కీమ్ లో చేరితే రూ .291 నుండి రూ .1454 వరకు నెలకు చెల్లించాల్సి ఉంటుంది. చందాదారుడు ఎంత ఎక్కువగా ప్రీమియం చెల్లిస్తే అంత ఎక్కువ మొత్తం పొందే అవకాశం అయితే ఉంటుంది. ఈ స్కీమ్ లో చేరిన వాళ్లు లక్షన్నర రూపాయల వరకు పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందవచ్చు.
ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయాలని అనుకునే వాళ్లు నెలవారీ, త్రైమాసికంగా, 6 నెలల వ్యవధిలో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఖాతాలో డబ్బులు ఆటో డెబిట్ అవుతాయి. 2015లో కేంద్రం ఈ స్కీమ్ ను ప్రారంభించింది. ఏ బ్యాంకు ద్వారానైనా ఈ స్కీమ్ లో చేరవచ్చు. వయస్సు ఆధారంగా నెలవారీ కంట్రిబ్యూషన్ ను నిర్ణయించడం జరుగుతుంది.