
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ప్రజల కోసం ఎన్నో స్కీమ్ లను అమలు చేస్తుండగా ఆ స్కీమ్ లలో అటల్ పెన్షన్ యోజన స్కీమ్ కూడా ఒకటి. తక్కువ మొత్తం ఇన్వెస్ట్ మెంట్ తో ఎక్కువ మొత్తం ఈ స్కీమ్ ద్వారా పొందే అవకాశం ఉంటుంది. పీఎఫ్ఆర్డీఏ ఈ స్కీమ్ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటుండటం గమనార్హం. 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ స్కీమ్ లో చేరవచ్చు.
ఎస్బీఐతో పాటు ఇతర ప్రాంతీయ బ్యాంకుల సహకారంతో ఈ స్కీమ్ లో చేరే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఈ స్కీమ్ లో చేరతారో వాళ్లు నెలకు 1,000 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు పొందే అవకాశం ఉంటుంది. 18 సంవత్సరాల వయస్సులో ఈ స్కీమ్ లో చేరి నెలకు 210 రూపాయలు చెల్లిస్తే ఏకంగా 5,000 రూపాయలు పెన్షన్ పొందే అవకాశాలు అయితే ఉంటాయి. రోజుకు 7 రూపాయలు ఆదా చేస్తే సరిపోతుంది.
నెలకు 42 రూపాయల చొప్పున చెల్లిస్తే మాత్రం 1,000 రూపాయల పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. 2,000 రూపాయల పెన్షన్ పొందాలంటే నెలకు 84 రూపాయల చొప్పున చెల్లించాలి. 3000 రూపాయల పెన్షన్ కోసం నెలకు 126 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 60 సంవత్సరాలు దాటిన తరువాత ఈ పెన్షన్ డబ్బులను పొందే అవకాశం ఉంటుంది. నెలవారీ ప్రీమియంను బట్టి చెల్లించే మొత్తం మారే అవకాశం ఉంటుంది.
ఈ పెన్షన్ వల్ల ఎంతో ప్రయోజననం చేకూరుతుందని చెప్పవచ్చు. కనిష్టంగా 1,000 రూపాయల నుంచి గరిష్టంగా 5000 రూపాయల వరకు పెన్షన్ ను తీసుకునే అవకాశం ఉంటుంది.