
కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో రిటైర్మెంట్ పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం అందిస్తున్న ఈ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా తక్కువ ప్రీమియంతో ఎక్కువ మొత్తం పొందే అవకాశం ఉంటుంది. కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్స్ లో అటల్ పెన్షన్ యోజన స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా 5,000 రూపాయల వరకు పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది.
60 సంవత్సరాల తర్వాత పెన్షన్ పొందాలని భావించే వాళ్లకు అటల్ పెన్షన్ యోజన స్కీమ్ బెస్ట్ స్కీమ్ అని చెప్పవచ్చు. నెలకు రూ.210 రూపాయలు కట్టడం ద్వారా రిటర్మెంట్ తర్వాత 5,000 పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. 18 సంవత్సరాల వయస్సులో ఈ స్కీమ్ లో చేరితే 210 రూపాయలు చెల్లించాలి. వయస్సు పెరిగితే ఎక్కువ మొత్తం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
30 సంవత్సరాల వయస్సు ఉన్నవాళ్లు 5,000 రూపాయల పెన్షన్ పొందాలని అనుకుంటే 577 రూపాయలు ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. వయసు ప్రాతిపదికన మీరు చెల్లించే ప్రీమియంలో మార్పులు ఉంటాయి. సమీపంలోని బ్యాంక్ ను సంప్రదించి సులభంగా ఈ స్కీమ్ లో చేరవచ్చు. 40 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ స్కీమ్ లో చేరడం సాధ్యమవుతుంది.
ఇతర స్కీమ్ లతో పోలిస్తే రిటైర్మెంట్ స్కీమ్ లలో అటల్ పెన్షన్ యోజన బెస్ట్ స్కీమ్ అని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో చేరే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.