ప్ర‌కాష్ రాజ్ మెగా పొగ‌డ్త‌లు.. కార‌ణం అదేనా?

‘వ‌కీల్ సాబ్’ సినిమాతోపాటు మెగా ఫ్యామిలీని ఈ మ‌ధ్య తెగ పొగిడేస్తున్నారు ప్ర‌కాష్ రాజ్‌. నిజానికి సినిమా ప్ర‌మోష‌న్ల‌కు పెద్ద‌గా హాజ‌రుకాని ప్ర‌కాష్‌.. ఇటీవ‌ల ఇంట‌ర్వ్యూల‌లో వ‌కీల్ సాబ్ చిత్రాన్ని మెచ్చుకుంటున్నారు. అంతేకాదు.. అందులో మెగా పొగ‌డ్త‌లు కూడా ఉంటున్నాయి. దీంతో.. ప్ర‌కాష్ రాజ్ తీరు వెనుక ఆంత‌ర్యం ఏంట‌నే చ‌ర్చ‌ మొద‌లైంది. అయితే.. అందుతున్న స‌మాచారం ప్ర‌కారం.. ఈ సారి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) అధ్య‌క్ష ప‌ద‌వికి ప్ర‌కాష్ రాజ్ పోటీ చేయాల‌ని చూస్తున్నార‌ట‌. […]

Written By: Bhaskar, Updated On : April 18, 2021 5:46 pm
Follow us on


‘వ‌కీల్ సాబ్’ సినిమాతోపాటు మెగా ఫ్యామిలీని ఈ మ‌ధ్య తెగ పొగిడేస్తున్నారు ప్ర‌కాష్ రాజ్‌. నిజానికి సినిమా ప్ర‌మోష‌న్ల‌కు పెద్ద‌గా హాజ‌రుకాని ప్ర‌కాష్‌.. ఇటీవ‌ల ఇంట‌ర్వ్యూల‌లో వ‌కీల్ సాబ్ చిత్రాన్ని మెచ్చుకుంటున్నారు. అంతేకాదు.. అందులో మెగా పొగ‌డ్త‌లు కూడా ఉంటున్నాయి. దీంతో.. ప్ర‌కాష్ రాజ్ తీరు వెనుక ఆంత‌ర్యం ఏంట‌నే చ‌ర్చ‌ మొద‌లైంది.

అయితే.. అందుతున్న స‌మాచారం ప్ర‌కారం.. ఈ సారి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) అధ్య‌క్ష ప‌ద‌వికి ప్ర‌కాష్ రాజ్ పోటీ చేయాల‌ని చూస్తున్నార‌ట‌. ఇప్పుడున క‌మిటీ ప‌ద‌వీ కాలం త్వ‌ర‌లో ముగియ‌నుంది. ‘మా’ ఎన్నిక‌ల్లో మెగా కాంపౌండ్ కీ రోల్ ప్లే చేస్తుందన్న సంగతి తెలిసిందే. ఇంకా చెప్పాలంటే.. వారు చెప్పిన వారే అధ్య‌క్షులుగా ఎన్నిక‌య్యే అవ‌కాశాలు ఉంటాయి.

ప్ర‌స్తుతం మా అధ్య‌క్షుడిగా ఉన్న సీనియ‌ర్ న‌రేష్ అయినా, అంత‌కు ముందున్న శివాజీ రాజా అయినా మెగా మ‌ద్ద‌తుతోనే విజ‌యం సాధించార‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. దీంతో.. ఈ సారి అధ్య‌క్షుడిగా నిల‌బ‌డాల‌ని చూస్తున్న ప్ర‌కాష్ రాజ్‌.. మెగా మ‌ద్ద‌తు పొందాల‌ని చూస్తున్నార‌నే ప్ర‌చారం సాగుతోంది. అందుకోస‌మే.. మెగా కాంపౌండ్ ను పొగుడుతున్నార‌ని అంటున్నారు.

అయితే.. ప్ర‌కాష్ రాజ్ కు, చిరంజీవికి మంచి సంబంధాలే ఉన్నాయి. గ‌తంలో ఓ సారి టాలీవుడ్ మొత్తం ప్ర‌కాష్ రాజ్ ను బ్లాక్ లిస్టులో పెట్టాల‌ని ప్ర‌య‌త్నించిన‌ప్పుడు.. చిరంజీవి స‌ర్దిచెప్పార‌నే ప్ర‌చారం సాగింది. ఇప్పుడు మా ఎన్నిక‌ల్లో ప్ర‌కాష్ నిల‌బ‌డితే మ‌ద్ద‌తు ఇచ్చే ఛాన్స్ కూడా ఉండొచ్చు. మ‌రి, ప్ర‌కాష్ రాజ్ పోటీ చేస్తార‌న్న మాట‌ల్లో నిజ‌మెంత‌? అన్న‌ది చూడాలి.