Pm Kisan Yojan : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘కిసాన్ సమ్మాన్ నిధి’ డబ్బులు ఇక నుంచి పొందాలంటే ఈ కేవైసీ తప్పనిసరి. గత ఏడాదిగా దీనిపై ప్రభుత్వం అనేక రకాలుగా ప్రచారం చేసింది. ఈ కేవైసీ చేసుకుంటనే కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు వస్తాయని తెలిసింది. అయినా చాలా మంది రైతులు ఇప్పటికీ ఈ కైవేసీ చేసుకోలేదు. అయితే వారికి నేరుగా అవగాహన కల్పించేందుకు 2024 ఫిబ్రవరి 12 నుంచి 21 వరకు ప్రత్యేకంగా కార్యక్రమం నిర్వహించనుంది. ఈసారి కేంద్ర ప్రభుత్వానికి చెందిన అధికారులు నేరుగా గ్రామాల్లోకి వెళ్లి ప్రత్యేకంగా క్యాంపులు నిర్వహించనున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..
రైతులకు ఆర్థిక సాయం కింద కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.6000 పంట సాయం చేస్తుంది. 5 నెలలకు ఒకసారి రూ.2000 రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. ఇప్పటి వరకు 15 విడతలు పూర్తి కాగా.. త్వరలో 16వ విడత కింద రూ.2000 సాయం చేయనుంది. ఈ తరుణంలో రైతులకు సంబంధించిన వివరాలు పక్కగా ఉండాలని, అందువల్ల రైతులు ఈ కేవైసీని చేయించుకోవాలని తెలిసింది. అయితే కొన్ని నెలలుగా ఈ ప్రక్రియ సాగుతోంది. కానీ కొంత మంది రైతులకు అవగాహన లేకపోవడంతో ఇప్పటికీ రైతులు ఈ కేవైసీ చేయించుకోలేదు.
దీంతో కొందరు రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు పడడం లేదు. ఆఫ్ లైన్ లో వీలు కాకపోతే ఆన్ లైన్ ద్వారా ఈ కేవేసీ చేయుంచుకోవాలని తెలిపింది. అయినా ఇప్పటికీ దానిని పట్టించుకోవడం లేదు. ఈసారి మాత్రం తప్పనిసరిగా ఈ కేవైసీ చేసుకోవాలని తెలుపుతోంది. లేకుంటే పీఎం కిసాన్ డబ్బులు రావని తెలిపింది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 12 నుంచి 21 వరకు గ్రామాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తారు. కొంత మంది సిబ్బంది రైతుల నుంచివివరాలు సేకరించి ఈ కేవైసీ పూర్తి చేస్తారు.
చాలా మంది రైతులు తమ భూమి అయినా ఈ కేవైసీ పూర్తి కాకపోవడంతో తమ ఖాతాల్లోకి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు పడడం లేదు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు. అయితే కొందరు రెవెన్యూ సిబ్బందిని ఈ విషయం అడగ్గా సరైన సమాధానం లేదు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు గ్రామాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఈ క్యాంపులు రైతులు సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం తెలుపుతోంది.