Guntur Kaaram: గుంటూరు కారం మూవీలో ఈ బ్లండర్ మిస్టేక్… మీరు గమనించారా? త్రివిక్రమ్ కి ఆ మాత్రం తెలియదా?

తాజాగా గుంటూరు కారం మూవీలో కూడా ఓ మిస్టేక్ ని జనాలు కనిపెట్టారు. త్రివిక్రమ్ పై సెటైర్లు వేస్తున్నారు. గుంటూరు కారం చిత్రంలో హీరో మహేష్ బాబు తండ్రి పాత్ర చేసిన జయరామ్ చేశాడు.

Written By: S Reddy, Updated On : February 14, 2024 6:21 pm

Guntur Kaaram

Follow us on

Guntur Kaaram: ఒక్కోసారి పెద్ద పెద్ద దర్శకులు కూడా మిస్టేక్స్ చేస్తుంటారు. భారీ కమర్షియల్ ఎంటర్టైనర్స్ లో తప్పులు దొర్లుతూ ఉంటాయి. ఆ మధ్య స్కంద మూవీలో ఓ బ్లండర్ మిస్టేక్ గమనించిన ఆడియన్స్ బోయపాటి శ్రీనుని ఏకిపారేశారు. ఓ వ్యక్తిని హీరో చంపుతాడు. సేమ్ వ్యక్తి నెక్స్ట్ షాట్ లో జనాల మధ్య కనిపిస్తాడు. అలాగే భగవంత్ కేసరి మూవీలో శరత్ కుమార్ జైలర్ రోల్ చేశారు. ఆ పాత్ర చనిపోయినప్పుడు న్యూస్ లో అతని డెసిగ్నేషన్ మార్చి చెబుతారు. ఈ మిస్టేక్ గురించి దర్శకుడు అనిల్ రావిపూడిని అడగ్గా… అవును తప్పు మాదే అని ఒప్పుకున్నాడు.

తాజాగా గుంటూరు కారం మూవీలో కూడా ఓ మిస్టేక్ ని జనాలు కనిపెట్టారు. త్రివిక్రమ్ పై సెటైర్లు వేస్తున్నారు. గుంటూరు కారం చిత్రంలో హీరో మహేష్ బాబు తండ్రి పాత్ర చేసిన జయరామ్ చేశాడు. తండ్రి, కొడుకులను వదిలేసిన రమ్యకృష్ణ మరో వివాహం చేసుకుంటుంది. జయరామ్ రోజూ గ్రామోఫోన్ రికార్డ్స్ వింటూ ఓ కిటికీ వద్ద కూర్చుని బయటకు చూస్తూ ఉంటాడు.

తండ్రిపై అసహనంతో మహేష్ ఓ మాట అంటాడు. ఎప్పుడూ కిటికీ వద్ద కూర్చొని అటు చూస్తుంటాడు. పోనీ వాళ్ళ ఆవిడ కోసం చూస్తున్నాడా అంటే… హైదరాబాద్ అటు లేదు ఇటుంది. అటు వైపు ఎందుకు చూస్తున్నాడో ఆ దేవుడికే తెలియాలి… అంటాడు. కానీ క్లైమాక్స్ లో మహేష్ బాబు తల్లిని ఆ కిటికీ వైపు నుండే తీసుకొస్తాడు. రమ్యకృష్ణ చీర కొంగు కారు నుండి బయటకు వచ్చి గాలికి ఎగరడం చూసి…జయరామ్ ఎమోషనల్ అవుతాడు.

ఇదే విషయాన్ని ప్రేక్షకులు త్రివిక్రమ్ ని అడుగుతున్నారు. హైదరాబాద్ అటు లేదు ఇటుందని హీరోతో చెప్పింది. అదే దారిన హైదరాబాద్ లో ఉన్న అమ్మ రమ్యకృష్ణను తీసుకురావడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. చూస్తుంటే గుంటూరు కారం విషయంలో త్రివిక్రమ్ అడ్డంగా దొరికిపోయాడనిపిస్తుంది. సంక్రాంతి కానుకగా విడుదలైన గుంటూరు కారం మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కేవలం మహేష్ స్టార్డం కారణం మూవీ ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. దర్శకుడిగా త్రివిక్రమ్ ఫెయిల్ అయ్యాడనే మాట వినిపించింది.