Bill Gates New Business In India: ఆర్థిక రంగంలో ప్రపంచ దేశాలతో భారత్ పోటీ పడుతోంది. విదేశీయులకు పెట్టుబడులకు అవకాశాలు ఇవ్వడంతో దేశ దేశాల నుంచి ఆర్థిక నిపుణులు భారత్ కు తరలివస్తున్నారు. ఒకప్పుడు బడా కంపెనీలన్నీ ఆమెరికా, ఆ తరువాత చైనాలో మాత్రమే నెలకొల్పేందుకు ఇంట్రెస్టు పెట్టేవారు. ఇప్పుడు భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో బిల్ గేట్స్ సహ వ్యవస్థాపకుడిగా ఉన్న ‘ఫిక్టివ్’ అనే సంస్థ హెడ్ ఆఫీసును ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు బెంగుళూరు లో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సంస్థ మరోవ్యవస్థాపకుడైన దేవ్ ఎవాన్స్ తెలిపారు.
ఫిక్టివ్ 2013లో ప్రారంభించారు. ఒక వస్తువును ఆన్లైన్లో కొనుగోలు చేసినప్పుడు దానిని వినియోగదారుడు అందుకునేవరకు వివిధ రవాణా మార్గాల ద్వారా సమయం పడుతుంది. ఈ క్రమంలో వినియోగదారుడు తన వస్తువు ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి ట్రాకింగ్ వ్యవస్థను ఫిక్టివ్ అభివృద్ధి చేసింది. విక్రేతల నుంచి ఆర్డర్లను ట్రాకింగ్ చేయడం, సరఫరా అయ్యే ఆ వస్తువు ఎక్కడ ఉందో కనుగొనడం పిక్టివ్ పని. ఇప్పటి వరకు ఇలా వస్తువుల సరఫరాలో ఎన్నో సమస్యలు వచ్చాయి. వాటిని అధిగమించడానికే ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు.
ఇప్పటికే పూణెలో దానిని ఏర్పాటు చేయడం ద్వారా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో మెయిన్ కార్యాలయాన్ని బెంగుళూరులో ఓపెన్ చేయడానికిసన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఫిక్టివ్ సేవలు అమెరికా, చైనాలో మాత్రమే ఉండేవి. ఇప్పుడు మూడో దేశం భారత్ కానుంది. ఈ సంస్థను ఏర్పాటు చేయడానికి బిల్ గేట్స్, దేవ్ ఎవాన్స్ కలిసి 192 మిలియన్ పెట్టుబడులు పెట్టారు. భారత్ లో కార్యకలాపాలు నిర్వహించేందుకు ఉదయ్ షెనాయ్ ని నియమించారు.
ఈ సందర్భంగా ఫిక్టివ్ భారత్ జనరల్ మేనేజర్ ఉదయ్ షెనాయ్ మాట్లాడుతూ పరిశోధన అభివృద్ధి, తయారీ నైపుణ్యం, సరఫరా వ్యవస్థలకు భారత్ కేంద్రం కాబోతుందని అన్నారు. ఇంజనీరింగ్ రంగలో ప్రతిభా వంతులను నియమించుకోవడం, నాణ్యత కేంద్రీకృత తయారీ భాగస్వాములను ఆకర్షించడం, సేవా మనస్తత్వం కలిగిన వ్యక్తులను తయారు చేయడం కంపెనీ బాధ్యత అని ఆయన తెలిపారు.