Arkade Developers Share Price: ఆర్కేడ్ డెవలపర్స్ సోమవారం స్టాక్ మార్కెట్‌లోకి ప్రవేశించింది, ఎందుకంటే ఈ షేరు బీఎస్‌ఈలో ఒక్కొక్కటి ₹175.90 వద్ద జాబితా చేయబడింది, ప్రతి షేరు ఇష్యూ ధర రూ.128కి 37.42% ప్రీమియంతో జాబితా చేయబడ్డాయి. గ్రే మార్కెట్‌లో కంపెనీ యొక్క ఈక్విటీ షేర్లు బలమైన ప్రీమియంతో ట్రేడవుతున్నందున ఆర్కేడ్ డెవలపర్స్ ఐపీవో జాబితా అంచనాల కంటే కొంచెం తక్కువగా ఉంది. ఆర్కేడ్ డెవలపర్స్ ఐపీవో జీఎంపీ లిస్టింగ్ కన్నా ముందు ఒక్కో షేరుకు రూ.64 ఉంది, పెట్టుబడిదారులకు లిస్టింగ్ లాభాలు దాదాపు 50% సిగ్నలింగ్ అ వుతున్నాయి.
ఆర్కేడ్ డెవలపర్స్ ఐపీవో వివరాలు..
రియల్ ఎస్టేట్ కంపెనీ ఆర్కేడ్ డెవలపర్స్ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ సెప్టెంబర్ 16న పబ్లిక్ సబ్‌స్క్రిప్షన్ కోసం ప్రారంభించబడింది. సెప్టెంబర్ 19న ముగిసింది. ఐపీవో కేటాయింపు సెప్టెంబర్ 20న ఖరారు చేశారు. ఆర్కెడ్ డెవలపర్స్ ఐపీవో లిస్టింగ్ తేదీ ఈ రోజు. ఆర్కేడ్ డెవలపర్స్ లిమిటెడ్ ఈక్విటీ షేర్లు బీఎస్‌ఈ, ఈడబ్ల్యూఈఎఫ్ రెండింటిలోనూ జాబితా చేయబడ్డాయి. ఆర్కెడ్ డెవలపర్స ఐపీవో ప్రైజ్ బ్యాండ్ ఒక్కో షేర్ ధర రూ.121 నుంచి 128గా నిర్ణయించబడింది. ప్రైస్ బ్యాండ్ పెరుగుదలతో కంపెనీ బుక్–బిల్ట్ ఇష్యూ నుంచి రూ.410 కోట్లను సేకరించింది, ఇది పూర్తిగా 3.2 కోట్ల ఈక్విటీ షేర్ల తాజా ఇష్యూ అయ్యాయి.
బలమైన సబ్‌స్క్రిప్షన్..
ఆర్కెడ్ డెవలపర్స్ ఐపీవో బలమైన సబ్‌స్క్రిప్షన్ పొందింది. భారీగా ఓవర్ సబ్‌స్క్రైబ్ చేయబడింది. ఇష్యూ మొత్తం 106.83 సార్లు బుక్ అయింది. ఇది రిటైల్ విభాగంలో 50.49 రెట్లు. క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ కొనుగోలుదారుల విభాగంలో 163.16 రెట్లు, నాన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ విభాగంలో 1163.02 రెట్లు సభ్యత్వం పొందింది.
మహారాష్ట్రలో రియల్ ఎస్టేట్..
ఆర్కెడ్ డెవలర్స్ లిమిటెడ్ మహారాష్ట్రలోని ముంబైలో హై ఎండ్ లైఫ్‌సైట్ల్ రెసిడెన్షియల్ ప్రాజెక్టులతో కూడిన రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కంపెనీ, కొనసాగుతున్న ప్రాజెక్టుల అభివృద్ధికి అయ్యే ఖర్చుల కోసం కొంత నిధుల సేకరణకు ఐపీవోకు వెళ్లింది. ఇదిలా ఉంటే ఆర్కెట్ డెవలపర్ షేర్ల లిస్టింగ్‌ను ఆశిస్తూ కేజ్రీవాల్ రీసెర్చ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ సర్వీసెస్ వ్యవస్థాపకుడు అరుణ కేజ్రీవాల్ మాట్లాడుతూ పబ్లిక్ ఇష్యూ పరిణామంలో చిన్నది, అధిక సబ్‌స్క్రిప్షన్ స్థితికి దారితీసిందన్నారు. అయినా 100 రెట్లు ఎక్కువ సబ్‌స్క్రిప్షన్ పొందడం అనేది విస్మరింరలేది విషయమని తెలిపారు. ఇటీవల లిస్టెడ్ స్టాక్‌లలో చూసినట్లుగా, లిస్టింగ్ అనంతరం ప్రతికూతలు ఉండవచ్చున్నారు. లాభాన్ని బుక్ చేసుకుని, లిస్టింగ్ తర్వాత ఉప సంహరించాలని సూచించారు.