Credit Card : క్రెడిట్ కార్డు  ను ఎక్కువగా వాడడం లేదా? అయితే ఈ సమస్యలు రావడం ఖాయం..

క్రెడిట్ కార్డు ఉపయోగించడం వల్ల బిల్లు భారం ఉండొచ్చు. కానీ అవసరమైనంత మేరకు వాడడం వల్ల ఒక్కోసారి రివార్డు పాయింట్స్ వస్తుంటాయి. అంతేకాకుండా క్రెడిట్ కార్డు ద్వారా ట్రాన్జాక్షన్ ఎక్కువగా చేయడం వల్ల బ్యాంకులు ఆ ఖాతాదారురుడిపై దృష్టి పెడుతాయి. క్రెడిట్ కార్డు బిల్లులతో పాటు ఈఎంఐలు సక్రమంగా చెల్లిస్తే అతని సిబిల్ స్కోరు పెరుగుతుంది.

Written By: Srinivas, Updated On : August 5, 2024 5:41 pm
Follow us on

Credit Card  : ప్రస్తుత కాలంలో చిరుద్యోగుల వద్ద క్రెడిట్ కార్లు ఒకటికి మించి ఉంటున్నాయి. చేతిలో డబ్బు లేకున్నా వస్తువుల కొనుగోలుతో పాటు అత్యవసర సమయంలో డబ్బు సాయం చేసే ఈ క్రెడిట్ కార్డుల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇవి ఉంటే ఇతరులను డబ్బు అడగాల్సిన అవసరం ఉండదు. పైగా క్రెడిట్ కార్డులపై ఒక్కోసారి రుణం కూడా అందిస్తారు. ఇవి తక్కువ వడ్డీరేటుకే ఉంటాయి. బ్యాంకులు సైతం ఒకప్పుడు ఆర్థిక లావాదేవీలు ఎక్కువగా చేసేవారికి మాత్రమే క్రెడిట్ కార్డు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు సాధారణ ఉద్యోగులకు సైతం లెక్కకు మించి కార్డులు అందిస్తున్నాయి. అయితే క్రెడిట్ కార్డు పదునైన కత్తి వంటిది. దీనిని ఎంత స్మూత్ గా వాడితే అంత బెటర్. అంటే అత్యవసరానికి లేదా అవసరమైన వస్తువులు కొనుగోలు చేయడానికి మాత్రమే ఉపయోగిస్తే మంచిది. లేదా దీని ద్వారా దుబార ఖర్చులు ఎక్కువగా చేయడం వల్ల బిల్లు భారం పెరిగిపోతుంది. దీంతో ఈ బిల్లు కట్టే సమయంలో డబ్బు అందకపోతే వడ్డీలపై వడ్డీలు విధిస్తారు. ఈ నేపథ్యంలో క్రెడిట్ కార్డును అవసరమైనంత మేరకు మాత్రమే ఉపయోగించుకోవాలి. అయితే క్రెడిట్ కార్డు ఎక్కువగా వాడడం బిల్లు సమస్య ఉంటుందని కొందరు దీనిని ఎక్కువగా ఉపయోగించడం లేదు. కొందరి వద్ద చాలా క్రెడిట్ కార్డులు ఉంటాయి. దీంతో కొన్నింటిని పెద్దగా పట్టించుకోరు. అయితే క్రెడిట్ కార్డు ఎక్కువగా వాడకపోవడం వల్ల బిల్లు తక్కువగా ఉంటుంది. కానీ ఇతర సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు ఏంటి? క్రెడిట్ కార్డు ఎంతవరకు కచ్చితంగా వాడాలి?

క్రెడిట్ కార్డు ఉపయోగించడం వల్ల బిల్లు భారం ఉండొచ్చు. కానీ అవసరమైనంత మేరకు వాడడం వల్ల ఒక్కోసారి రివార్డు పాయింట్స్ వస్తుంటాయి. అంతేకాకుండా క్రెడిట్ కార్డు ద్వారా ట్రాన్జాక్షన్ ఎక్కువగా చేయడం వల్ల బ్యాంకులు ఆ ఖాతాదారురుడిపై దృష్టి పెడుతాయి. క్రెడిట్ కార్డు బిల్లులతో పాటు ఈఎంఐలు సక్రమంగా చెల్లిస్తే అతని సిబిల్ స్కోరు పెరుగుతుంది. దీంతో తక్కువ వడ్డీకే రుణం అందుతుంది. ఈ రుణం సైతం ఇన్ టైంలో పే చేయడం వల్ల రుణ మొత్ం పెరిగే అవకాశం ఉంటుంది.

క్రెడిట్ కార్డు ఉన్నా కొందరు దానిని పట్టించుకోరు. ఇలా పట్టించుకోకపోతే తాత్కాలికంగా ఎలాంటి నష్టం ఉండదు. కానీ దీర్ఘ కాలంలో అనేక సమస్యలు వస్తాయి. క్రెడిట్ కార్డు ఎక్కువగా వాడకపోవడం వల్ల క్రెడిట్ హిస్టరీని కోల్పోతారు. దీంతో ఇలా చాలా కాలం పాటు వాడకుండా ఉండడం వల్ల ఆ కార్డు డియాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. ఒక్కసారి కార్డు డియాక్టివేట్ అయితే దానిని యాక్టివ్ చేసుకునే ప్రాసెస్ చాలా సమస్యగా మారుతుంది. అందువల్ల క్రెడిట్ కార్డును వాడుతూ ఉండాలి.

ప్రతీ నెలకు రెండు సార్లు అయినా కార్డు వాడే ప్రయత్నం చేయాలి. అలా చేయకపోతే సిబిల్ స్కోర్ పెరిగే విషయంలో ఈ కార్డు సమస్యగా మారుతుంది. కార్డుపై ఎలాంటి లావాదేవీలు నిర్వహించకపోతే.. దీనిపై రుణం తీసుకోవచ్చు. ఇలా ఒక్కసారి లోన్ తీసుకున్న తరువాత ఆ తరువాత ఈ మొత్తం ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇలా సిబిల్ స్కోరును బట్టి రూ. 20 లక్షలు కూడా ఎలాంటి డాక్యుమెంటేషన్ లేకుండా ఇచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఈ అవకాశాన్ని కోల్పోకూడదు.

క్రెడిట్ కార్డు ఎక్కువగా వాడకపోవడం వల్ల రివార్డు పాయింట్స్ తక్కువగా వస్తాయి. దీంతో కొన్ని ఆఫర్ల విషయంలో అత్యవసర సమయంలో ఈ కార్డు పనికి రాకుండా ఉంటుంది. దీంతో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. చిన్న బ్యాంకుల కార్డుల విషయంలో పట్టించుకోకున్నా.. ఎస్బీఐ లాంటి కార్డు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒక్కసారి డియాక్టివేట్ అయితే మళ్లీ తీసుకోవడం కష్టతరం అవుతుంది.