Brahma Anandha Movie in OTT
Brahma Anandha Movie : బ్రహ్మానందం, తన కుమారుడు రాజా గౌతమ్ కలిసి నటించిన లేటెస్ట్ మూవీ బ్రహ్మా ఆనందం. రియల్ లైఫ్‌లో తండ్రి, కొడుకులు అయిన వీరు సినిమాలో మాత్రం తాతా మనవళ్లుగా నటించారు. ఈ సినిమా గత నెల ప్రేమికుల రోజున ఫిబ్రవరి 14వ తేదీన విడుదల అయ్యింది. ఇద్దరు కలిసి నటించిన ఈ సినిమా ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయ్యింది. ఇందులో బ్రహ్మానందం కామెడీ టైమింగ్, యాక్టింగ్, కొన్ని ఎమోషనల్ సీన్లు ప్రేక్షకులను ఎంత బాగో ఆకట్టుకుంటాయి. అయితే ఈ సినిమా ఈ నెల 19వ తేదీ నుంచి ఓటీటీలోకి స్ట్రీమింగ్ కానుంది. ఆహా వేదికగా బ్రహ్మా ఆనందం మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు ఆహా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద వంటి సినిమాలను వరుస హిట్ అయ్యాయి. ఈ సినిమాలు స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వచ్చింది. ఈ బ్రహ్మా ఆనందం మూవీ కూడా ఇదే బ్యానర్‌పై వచ్చింది. ఈ సినిమాకి దర్శకుడు ఆర్‌వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి రాహుల్ యాదవ్ నక్కా నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఈ సినిమాలో బ్రహ్మానందం, రాజా గౌతమ్‌తో పాటు ప్రియా వడ్లమాని, వెన్నెల కిశోర్, దివిజ, సంపత్ రాజ్, రాజీవ్ కనకాల, తాళ్లూరి రామేశ్వరి వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఆశించినంత స్థాయిలో అయితే మెప్పించలేదు. కొన్ని సీన్లు, కామెడీ, బ్రహ్మానందం ఎమోషనల్ సీన్లు కాస్త మూవీకి ప్లస్ అయ్యాయి. ఎప్పటిలానే రొటీన్ లవ్ స్టోరీ ఈ సినిమాలో ఉంది.
Also Read : జూనియర్ ఎన్టీఆర్ తో పోటీ వద్దు అంటూ ‘కూలీ’ మేకర్స్ కి రజినీకాంత్ హెచ్చరిక!
ఇక సినిమా స్టోరీ విషయానికొస్తే బ్రహ్మ అలియాస్ బ్రహ్మానందం (రాజా గౌతమ్) చిన్నతనతంలోనే తల్లిదండ్రులను కోల్పోతాడు. అలా పెరిగి ఎవరిని నమ్మకుండా చాలా సెల్ఫిష్‌గా రాజా గౌతమ్ మారిపోతాడు. అయితే సినిమాలు మీద ఇష్టంతో చిన్నతనం నుంచే రాజా గౌతమ్.. నాటకాలు, డ్రామాలకు వెళ్తుంటాడు. అలా పెద్దయ్యాక థియేటర్ ఆర్టిస్ట్‌గా చేస్తుంటాడు. అయితే భవిష్యత్తులో ఎప్పటికైనా కూడా పెద్ద యాక్టర్ కావాలని కలల కంటాడు. దీని కోసం చేయని ప్రయత్నం అంటూ ఉండదు. అయితే ఏదో విధంగా తన గురువు సాయంతో ఢిల్లీలోని కళారంగ్ మహోత్సవంలో నాటకం వేసే అవకాశం తెచ్చుకుంటాడు. కానీ ఇందులో నటించాలంటే మాత్రం తప్పకుండా డబ్బులు కట్టాలని డిమాండ్ చేస్తాడు. దాదాపుగా రూ.6 లక్షలు కట్టాలి. అప్పుడే ఆ నాటకంలో నటించాలి. దీనికి డబ్బులు సర్దుబాటు చేస్తున్న సమయంలో వృద్ధాశ్రమంలో ఉన్న తన తాత ఆనంద రామ్మూర్తి (బ్రహ్మానందం)ను కలుస్తాడు. తాను చెప్పినట్లు చేస్తే తన పేరు మీద ఉన్న ఆరు ఎకరాలు భూమిని ఇస్తానని చెబుతాడు. ఈ క్రమంలో బ్రహ్మనందం వారి గ్రామానికి రాజాగౌతమ్‌ను తీసుకెళ్తాడు. ఈ క్రమంలో తాను ప్రేమించిన ప్రియా వడ్లమానిని కూడా రాజా గౌతమ్ దూరం చేసుకుంటాడు. ఇలా ఆ గ్రామం వెళ్లాక ఏం చేశారు? అసలు బ్రహ్మానందం ఎందుకు భూమిని ఇవ్వాలనుకున్నాడు? అనే పూర్తి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Also Read :‘రజినీకాంత్’ థియేటర్ కూల్చివేత..అక్షరాలా 40 ఏళ్ళ చరిత్ర..శోకసంద్రంలో ఫ్యాన్స్!